Carrots : చలికాలంలో సహజంగానే చాలా మంది వివిధ రకాల భిన్నమైన వంటలను చేసుకుని తింటుంటారు. అయితే ఈ సీజన్‌లో క్యారెట్లు మనకు విరివిగా లభిస్తాయి. కనుక క్యారెట్‌ను ఈ సీజన్‌లో కచ్చితంగా తీసుకోవాలి. రోజూ క్యారెట్‌ను తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. దీంతోపాటు వ్యాధుల నుంచి బయట పడవచ్చు.
క్యారెట్లలో విటమిన్లు ఎ, సి, కె, పొటాషియం, ఐరన్, కాపర్, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తాయి.
రోజూ క్యారెట్లను తినడంవల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక క్యారెట్లను తింటుంటే ఆ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. క్యారెట్లలో ఉండే బీటా కెరోటీన్, ఆల్ఫా కెరోటీన్, లుటీన్‌లు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలో హార్ట్ ఎటాక్ లు రాకుండా నివారించవచ్చు.
అధిక బరువు తగ్గాలనుకునే వారికి క్యారెట్లు ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలంలో బరువు తగ్గడం కొద్దిగా కష్టమే. కానీ క్యారెట్లను తింటే మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజూ క్యారెట్లను తినాలి.
కంటి చూపును మెరుగు పరచడంలో క్యారెట్లు ఎంతో ఉపయోగపడతాయి. వీటిల్లో ఉండే విటమిన్ ఎ కంటి చూపును పెంచుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఈ సీజన్‌లో మనకు రోగ నిరోధక శక్తి చాలా అవసరం. క్యారెట్లలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
మొటిమలు, నల్లని మచ్చలు ఉన్నవారు రోజూ క్యారెట్లను తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు చిగుళ్లు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
క్యారెట్లను రోజూ తినలేని వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఒక కప్పు జ్యూస్ తాగవచ్చు. లేదా మధ్యాహ్నం లంచ్ కు ముందు కూడా తీసుకోవచ్చు. క్యారెట్లను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. క్యారెట్లను భోజనానికి ముందు తీసుకోవచ్చు. రాత్రి భోజనానికి ముందు లేదా రాత్రి నిద్రకు ముందు కూడా తినవచ్చు. దీంతో పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.