Loss Of Smell And Taste : కరోనా సోకిన వారికి సహజంగానే చాలా లక్షణాలు కనిపిస్తుంటాయి. కరోనా నుంచి కోలుకున్నాక ఆ లక్షణాలు తగ్గిపోతాయి. అయితే రుచి, వాసనలను గ్రహించే శక్తి అంత త్వరగా రాదు. కరోనా వచ్చిన వారిలో చాలా మందికి రుచి, వాసనలను గుర్తించే శక్తి నశిస్తుంది. ఈ క్రమంలోనే కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా చాలా రోజులకు ఆ శక్తి రాదు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల కోల్పోయిన రుచి, వాసన శక్తిని తిరిగి పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
1. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ రుచి, వాసనలను పసిగట్టే శక్తి ఇంకా రాని వారు ఆముదంను ఉపయోగించవచ్చు. కొద్దిగా ఆముదాన్ని తీసుకున్ని వేడి చేయాలి. అనంతరం దాన్ని ఒక్కో చుక్క మోతాదులో ఒక్కో ముక్కు రంధ్రంలోనూ వేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేయాలి. 5 నుంచి 7 రోజుల పాటు ఇలా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. కోల్పోయిన రుచి, వాసనలను గ్రహించే శక్తి తిరిగి లభిస్తుంది.
2. రోజూ ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుండాలి. లేదా ఒక కప్పు నీటిలో దంచిన రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించి ఆ నీటిని తాగాలి. ఇలా రోజుకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. దీంతో రుచి, వాసనలను పసిగట్టే శక్తి మరలా వస్తుంది.
3. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగుతుండాలి. దీని వల్ల కూడా రుచి, వాసనలను పసిగట్టే శక్తి తిరిగి లభిస్తుంది. వాటిని మళ్లీ గుర్తించగలుగుతారు.
4. కోల్పోయిన రుచి, వాసన శక్తిని తిరిగి రప్పించడంలో అల్లం కూడా బాగానే పనిచేస్తుంది. ఇది రుచిని, వాసనలను తిరిగి అందిస్తుంది. అందుకు గాను రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ అల్లం రసం తాగాలి. లేదా చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. ఇలా చేస్తుంటే తిరిగి రుచి, వాసనలను గుర్తించగలుగుతారు.
5. కొన్ని పుదీనా ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగవచ్చు. దీంతో రుచి, వాసనలను గ్రహించే శక్తి మళ్లీ వస్తుంది. రుచి, వాసనలను సరిగ్గా గుర్తించగలుగుతారు.
ఇక కరోనా నుంచి కోలుకున్నవారు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. రోజుకు ఒక కోడిగుడ్డు, నట్స్, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు.