business

ర‌ష్యా నుంచి పెద్ద ఎత్తున రాడార్‌ల‌ను కొనుగోలు చేస్తున్న భార‌త్‌.. ఎందుకు..?

40,000 కోట్ల రూపాయలు విలువ చేసే రష్యన్ voronezh రాడార్ కొనుగోలు కి భారత్ చర్చలు జరుపుతుంది. ఇంత ఖర్చుపెట్టి దీన్ని కొనుగోలు చేయవలసిన అవసరం ఏమిటి? ప్రస్తుతం, భారత్ తన క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం ఇశ్రాయేల్ Green pine radar ( 500 km range ) అలాగే DRDO అభివృద్ధి చేసిన స్వోర్డ్ ఫిష్ రాడార్ ( 1500 km range ) వినియోగిస్తుంది. ఇవి, సెకండ్ కి 3km వేగం తో ప్రయాణించే క్షిపణుల‌తో సహా 30 లక్ష్యాలను గమనించగలవు. కానీ, భూమి horizon కారణం గా శత్రువు ప్రయోగించే క్షిపణిని ముందుగా పసిగట్టే విషయం లో వీటికి చాలా పరిమితులు ఉన్నాయి.

ఉదాహరణకి, శత్రువులు భారత్ మీద క్షిపణి ప్రయోగం జరిపితే, మనం పసిగట్టిన తరువాత స్పందించడానికి కేవలం 30 సెకండ్స్ సమయం మాత్రమే ఉంటుంది. 2023 లో ఇశ్రాయేల్ మీద yamani రెబల్స్ ప్రయోగించిన క్షిపణి 1500 km ప్రయాణించిన తరువాత 100km ఎత్తులో దాన్ని ఇశ్రాయేల్ భేదించింది ( ఇంకా ముందే ఆ పని చెయ్యాలి అన్న ప్రయత్నం చేస్తుంది).

india purchases radars from russia know why

voronezh రాడార్ 6 నుంచి 8 వేల KM లు దూరం లో ఉన్న లక్ష్యాలను గమనించగలదు. High నుంచి ultra high frequency లో ఇది పనిచేస్తుంది కాబట్టి stealth యుద్ద విమానాలను కూడా పసిగట్టగలదు. దీనిని కర్ణాటక లో ni Chitradurga లో దీనిని install చెయ్యాలి అన్న ప్రణాళికలు ఉన్నాయి. అక్కడినుంచి చైనా, pakisthan మాత్రమే కాకుండా భారత నావికా దళానికి సహకరించేందుకు సముద్ర ప్రాంతాన్ని కూడా monitor చేసే అవకాశం ఉంటుంది అని ఆలోచన.

Admin

Recent Posts