business

రతన్‌ టాటా ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

టాటా సన్స్ మాజీ చైర్మన్ గా రతన్ టాటా వార్షిక వేతనం దాదాపుగా రూ. 2.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో టాప్ బిజినెస్ లీడర్స్ తో ఒక పోల్చి చూసినట్లయితే రతన్ టాటా జీతం తక్కువ. ఆయనకు టాటా సన్స్ లో చిన్న వ్యక్తిగత వాటా నుంచి డివిడింగ్స్ కూడా అందుతాయి. ఈ లాభాల్లో 66% విద్య, ఆరోగ్య సంరక్షణ అలాగే ఇతర సేవలు కోసం చారిటబుల్ ట్రస్ట్లకు వెళ్తుంది. ఈయనకు అనేక ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటన్నిటిలో ముంబైలోని కోలాబాలో సముద్రానికి ఎదురుగా ఉన్న బంగ్లా ఖరీదైనది. దాని విలువ వచ్చేసి 150 కోట్లు కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

టాటా సన్స్ లో రతన్ టాటా కి వాటా ఉంది. ఇది చాలా చిన్నది. అయినా టాటా గ్రూప్ అనేక విభిన్న పరిశ్రమలలో కార్యకర్తలని నిర్వహిస్తుంది. కనుక ఇది చాలా విలువైనది. ఈ వాటా ద్వారా రతన్ టాటా సంపాదించే డబ్బులు ఎక్కువ భాగం ట్రస్టులు, అలాగే స్వచ్ఛంద సంస్థలకు వెళ్తుంది. రతన్ టాటా ఓలా, పేటీఎం తో పాటుగా కొన్ని స్టార్ట్ అప్స్ లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈయనకు కార్లు అంటే చాలా ఇష్టం. నానో ప్రపంచంలోనే సరసమైన కారుగా గుర్తింపును తెచ్చుకుంది.

ratan tata net worth and properties value

రతన్ టాటా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణాభివృద్ధితో పాటు ఇతర అవసరాలకు $1.2 బిలియన్ల (సుమారు రూ.9,000 కోట్లు) విరాళంగా ఇచ్చారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు $50 మిలియన్లు విరాళంగా ఇచ్చారు. కార్నెల్ విశ్వవిద్యాలయానికి $28 మిలియన్లు అందించారు. అంతే కాక కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం విద్యా కార్యక్రమాల కోసం $35 మిలియన్లు ఇచ్చారు.

Peddinti Sravya

Recent Posts