సాధారణంగా చాలా మంది ఉదయం నిద్రలేవగానే టీ, కాఫీ తాగుతారు. కొందరు కాలకృత్యాలు తీర్చుకుని తమ దైనందిన కార్యక్రమాలు మొదలు పెడతారు. అలాగే ఉదయం ఆఫీసులకు, కాలేజీలకు, పనులకు వెళ్తుంటారు. అయితే ఉదయాన్నే నిద్రలేవగానే ఎవరైనా సరే తప్పనిసరిగా చేయాల్సిన పని ఒకటుంది. దీన్ని చేయడం ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి. మన పెద్దలు ఇలాగే చేసేవారు. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలు పోవడంతోపాటు దైవం ఆశీస్సులు లభిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. ఇక నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన చేతుల్లో దేవతలు కొలువై ఉంటారు. చేతుల చివర.. అంటే వేళ్ల చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. మధ్యభాగంలో సరస్వతీ దేవి ఉంటుంది. అలాగే వేళ్ల చివర్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఈ క్రమంలోనే ఉదయం నిద్ర లేచిన వెంటనే వేటినీ చూడకుండా ముందుగా మన చేతులను, వేళ్లను చూడాలి. తరువాత వాటిని రుద్ది కళ్లకు అద్దుకోవాలి. ఆ తరువాత చేతులను తీశాకే ప్రపంచాన్ని చూడాలి. ఇలా రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా రోజూ ఉదయాన్నే లేచిన వెంటనే చేతులను, వేళ్లను చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లభిస్తాయి. చక్కని జ్ఞానం వస్తుంది. సంపద చేకూరుతుంది. డబ్బు నిలుస్తుంది. అన్ని సమస్యలు పోతాయి. కనుకనే మన పెద్దలు ఇలా చేసేవారు. కాబట్టి ఈ విధంగా తప్పక చేయాలి. ఇక ఇలా చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. మనం చేతులను రుద్ది కళ్లకు అద్దుకోవడం వల్ల చేతుల్లోని ఉష్ణశక్తి మనలోకి చేరుతుంది. దీంతో మనం యాక్టివ్‌గా మారుతాం. రోజంతా ఉత్సాహంగా పనిచేస్తాం. బద్దకం అన్నది ఉండదు. కాబట్టి నిద్ర లేచిన వెంటనే ఇలా చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. దేవుళ్ల ఆశీర్వచనాలను మనం రోజూ పొందవచ్చు. కనుక రోజూ ఇలా చేయాలి.
ఇక చేతులను, వేళ్లను చూస్తూ వాటిని రుద్ది కళ్లకు అద్దుకునే క్రమంలో వీలైతే ఒక మంత్రాన్ని కూడా చదవచ్చు. అది ఏమిటంటే.. కరాగ్రే వసలే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనం.. ఈ మంత్రాన్ని చదువుతూ పైన చెప్పిన విధంగా చేస్తే.. ఇంకా ఎంతో ప్రయోజనం కలుగుతుంది.