business

ర‌తన్ టాటా వార‌సులు ఎవ‌రు.. ఆయ‌న సామ్రాజ్యానికి అధిప‌తిగా ఎవ‌రుంటారు?

రతన్ టాటా.. ఆయ‌న ప్రముఖ వ్యాపార దిగ్గజంగానే కాదు.. పరోపకారిగా అంద‌రికి సుప‌రిచితం. ర‌త‌న్ టాటా మంచి మాన‌వ‌తా వాది కూడా. ఒక మానవతావాదిగా ఆయన అసాధారణ నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.1937లో డిసెంబర్ 28న ముంబైలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. ఆయన సూరత్‌లో నావల్ టాటా, జమ్‌సెట్‌జీ మేనకోడలు సూని టాటా తరువాత టాటా ఫ్యామిలీలోకి ఆయన్ను దత్తత తీసుకున్నారు. టాటా కుటుంబంలో ఒక సభ్యుడు అయ్యారు. 1948లో రతన్ టాటాకు 10ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత టాటా అమ్మమ్మ, నవాజ్‌బాయి టాటా ఆయన్ను దత్తత తీసుకున్నారు.

సిమోన్ టాటాను తండ్రి నావల్ టాటా రెండో వివాహం చేసుకున్నారు. దాంతో రతన్ టాకు ఒక తమ్ముడు జిమ్మీ టాటా, సవతి సోదరుడు నోయెల్ టాటా ఉన్నారు. టాటా తన చిన్నతనంలో ఎక్కువ భాగం భారత్‌లోనే గడిపారు. లాస్ ఏంజిల్స్‌లో ఉండగా దాదాపు ప్రేమ, పెళ్లి వ్యవహారం వరకు వెళ్లింది. కానీ, దురదృష్టవశాత్తు.. రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన భారత్‌కు వెళ్లవలసి వచ్చింది. తన కాబోయే జీవిత భాగస్వామి తనతో కలిసి భారత్ వెళ్లాలని భావించారు. అప్పట్లో ఇండో-చైనా యుద్ధం కారణంగా భారత్‌లో నెలకొన్న అస్థిరత కారణంగా ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. అక్కడితో వారిద్దరి అనుబంధం ముగిసింది.

who will lead tata goup now after ratan tata

ఇప్పుడు టాటా మ‌ర‌ణం త‌ర్వాత టాటా గ్రూపుని భుజాల‌పైకి ఎత్తుకునే వారు ఎవ‌రు అనే అనుమానం అంద‌రిలో త‌లెత్తుతుంది. ర‌త‌న్ టాటా అనంత‌రం వార‌సులైన లియో టాటా, మాయ టాటా, నెవిల్లే టాటాపైనే అంద‌రి దృష్టి ఉంది.లియో టాటా స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఐఈ బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ పొందింది.అంచెలంచ‌లుగా ఎదిగిన ఆమె ఇప్పుడు ఇండియ‌న్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ గా ప‌ని చేస్తుంది. ఇక నోయ‌ల్ నావ‌ల్ టాటా చిన్న కుమార్తె మాయా టాటా కూడా రేసులో ఉంది.

ఆమె టాటా గ్రూప్‌కి చెందిన ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ సంస్థ టాటా క్యాపిట‌ల్‌లో ప‌ని చేస్తున్నారు. ఇక టాటాల వార‌సుడు నెవిల్లే టాటా త‌న టాటా కెరీర్ టాటాకి చెందిన ట్రెంట్ సంస్థ‌లో ప్రారంభించాడు. వీరే కాకుండా టాటాల‌తో బంధుత్వం ఉన్న షాపూర్జీ ప‌ల్లోంజీ వార‌సులు సైతం టాటా సన్స్‌లో వార‌సులుగా ఉన్నారు. బోర్డ్ నియ‌మం ప్ర‌కారం వార‌సుల‌నే నియ‌మిస్తారు. ఇక షేర్ల‌ని ఎవ‌రికి బ‌ద‌లాయించాలి అనేది వీలునామాని బ‌ట్టి నిర్ణ‌యిస్తారు. 156 సంవ‌త్స‌రాలు చ‌రిత్ర క‌లిగిన టాటా గ్రూప్ జంషెడ్ జీ టాటా నుండి ర‌త‌న్ టాటా వ‌ర‌కు టాటా వ‌ర‌కు టాటా కుటుంబం చేతిలో ఆకాశ‌మే హ‌ద్దుగా అన్ని రంగాల‌లో దూసుకెళ్లింది. ప్ర‌స్తుతం ఈ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.34 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు.

Sam

Recent Posts