Raw Coconut : చాలా మంది కొబ్బరి నీటిని తాగేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. కానీ పచ్చి కొబ్బరిని తినేందుకు ఏ మాత్రం ఆసక్తిని చూపించరు. కానీ పచ్చి కొబ్బరిలోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పచ్చి కొబ్బరిని తినడం వల్ల మనకు పోషకాలు అందుతాయి. అలాగే పలు అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఈ క్రమంలోనే తరచూ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరిలో కాపర్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, జింక్, విటమిన్ బి1, బి5, బి9 తదితర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. శరీరానికి శక్తి లభిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పచ్చి కొబ్బరి తినాలి. అలాగే గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటూ ఉంటే గుండె ఆరోగ్యం మెరగవుతుంది. రక్తసరఫరా సరిగ్గా ఉంటుంది. హైబీపీ తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు పచ్చి కొబ్బరిని తింటే వారి రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. పచ్చికొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
పచ్చి కొబ్బరిని తినడం వల్ల చర్మ సమస్యలు పోతాయి. అలాగే గోర్లు, వెంట్రుకల సమస్యలు కూడా పోతాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారికి పచ్చి కొబ్బరి మంచి ఆహారం అని చెప్పవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరి తినాలి. దీని వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి. అలాగే డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ఇక పచ్చి కొబ్బరిని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో నీరసం, అలసట తగ్గుతాయి. రోజంతా నీరసంగా ఉందని భావించే వారు కాస్త పచ్చి కొబ్బరిని తినాలి. దీంతో శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. ఇలా పచ్చి కొబ్బరితో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక దీన్ని రోజూ తినాల్సి ఉంటుంది.