ఆధ్యాత్మికం

సంతానం కోసం ఎదురుచూస్తున్నారా.. ఈ వ్రతం ఆచరిస్తే తప్పక సంతానం క‌లుగుతుంది!

<p style&equals;"text-align&colon; justify&semi;">దేశంలో ఎందరో దంపతులు సంతానం కోసం పలు వ్రతాలు&comma; నోములు ఆచరిస్తారు&period; ఎవ్వరు ఏది చెపితే దాని ఆచరిస్తారు&period; కానీ శాస్త్రప్రవచనం ప్రకారం భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పక సంతానం పొందుతారు&period; అలాంటి అత్యంత పవిత్రమైన&comma; శక్తివంతమైన వ్రతం భవానీ అష్టమి వ్రతం&period; పార్వతీదేవినే భవాని అంటారు&period; దీనికి కారణం భవుని భార్య కాబట్టి&period; పార్వతీదేవి చైత్ర శుద్ధ అష్టమినాడు జన్మించింది&period; ఆ పుణ్యతిథిని భవానీ అష్టమి అంటారు&period; దీనినే అశోకాష్టమి అని కూడా అంటారు&period; చైత్ర శుద్ధ అష్టమినాడు ఇంటిముందు ఆవుపేడతో అలికి&comma; ముగ్గులు పెట్టి&comma; ఇంటికి మామిడాకు తోరణాలతో అలంకరించాలి&period; ప్రాతఃకాలమందే స్నానం ఆచరించాలి&period; స్నానం ఆచరించే సమయంలో గంగా&comma; యమునా&comma; గోదావరి&comma; కృష్ణ&comma; కావేరీ&comma; తుంగభద్ర వంటి నదుల పేర్లను స్మరించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్నానానంతరం నూతన వస్ర్తాలను ధరించాలి&period; అనంతరం పార్వతీదేవి చిత్రపటాన్ని అశోకచెట్టు కింద ఉంచి భవానిమాతను పూజించాలి&period; షోడశోపచార పూజలు చేయాలి&period; అనంతరం ఎనిమిది అశోకమొగ్గలను దైవప్రసాదంగా భుజించాలి&period; ఇలా ప్రసాదం స్వీకరించినవారికి శోకం ఉండదు&period; శోకనివారిణి కాబట్టి ఈ చెట్టును అశోకమని అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77563 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;vratham&period;jpg" alt&equals;"couple who will do pooja will get kids " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికీ ఉత్తరభారతంలో స్త్రీలు తమ సంతతి క్షేమంగా ఉండాలని అశోకమొగ్గలను నీటిలో కలిపి సేవించే ఆచారం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంతానం లేనివారికి ఈ వ్రతం ఆచరిస్తే తప్పక సంతానం అవుతుందని పురాణాలు పేర్కొన్నాయి&period; అత్యంత సులభమైన వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts