ఆధ్యాత్మికం

బిలంలో ఉండే ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే.. కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పవిత్ర స్థలాలు దాదాపు కొండలపై&comma; లోయల్లో&comma; గుహల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు&period; అటువంటి కోవలోకి వచ్చే ఒక పవిత్ర క్షేత్రం ఇది&period; గుహలో శివలింగం&period; అచ్చెరువు నొందించే ఈ బిలంలోని దేవాలయ విశేషాలు తెలుసుకుందాం… గుంటూరు జిల్లా గురజాలకు 6 కి&period;మీ దూరంలో ఉన్న దైద గ్రామంలోని మహిమాన్వత శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆలయం&period; సుందర అటవీ ప్రాంతం&comma; పవిత్ర కృష్ణానది తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం మనోహరంగా ఉంటుంది&period; ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి 120 ఏండ్లు అయ్యింది&period; ఐనా ఈ దేవాలయం కొన్ని వందల ఏండ్ల క్రితమే ఇక్కడ శివుడు స్యయంభూగా శివలింగం రూపంలో ఒక కొండ బిలంలో వెలిసినట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి&period; ఈ ప్రశాంత వాతావరణంలో సిద్దులు&comma; రుషులు&comma; దివ్య పురుషులు ఇక్కడకు వచ్చి శివున్ని ఆరాధించేవారు&period; ఈ అడవి ప్రాంతంలో దైద&comma; తేలుకుట్ల&comma; గొట్టిముక్కలకి చెందిన పశువుల కాపరులు తమ పశువులను మేతకు తీసుకెళ్లేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకరోజు ఇప్పుడున్న దేవాలయ కొండ ప్రాంతంలో పశువులు మేపుతుండగా ఓం నమశివాయః అంటూ శబ్దం వినిపించింది&period; దీంతో పశువుల కాపరులు కొండ వద్దకు వెళ్లి కొండ చుట్టూ శబ్దం వచ్చిన వైపు వెళ్లగా ఒక బండ రాయి నుండి శబ్దం వస్తున్నట్లు గ్రహించి&comma; ఆ రాయిని తొలగించగా కొండ లోపలికి ఒక సొరంగ మార్గం కనిపించింది&period; పశువుల కాపరులు ఆ బిలం గుండా అతి కష్టమైన ఇరుకు దారిలో వెళ్లి చూడగా ఒక అధ్బుత దృశ్యం గోచరించింది&period; అక్కడ ఒక శివలింగానికి కొందరు పెద్ద గడ్డాలతో ఉన్న రుషులు ఉన్న అభిషేకం చేస్తూ&comma; à°¶à°¿à°µ స్తోత్రం చేస్తున్నారు&period; పశువుల కాపర్లకు వారి దగ్గరకు వెళ్లేందుకు దైర్యం చాలక వెనుకకు వచ్చి దగ్గరలో పొలంలోపని చేస్తున్న కొందరికి చెప్పగా&comma; వారు చూద్ద్దాం పదండి అంటూ పశువుల కాపరులు తో కలసి ఆప్రాంతానికి వచ్చారు&period; అందరు లోపలికి పోయి చూడగా అక్కడ రుషులు కనపడలేదు&comma; కాని శివలింగానికి పూజ చేసిన ఆనవాళ్లు కనిపించాయి&period; అంతట వారు తన్మయత్వంతో శివలింగం కి పూజ చేసి బయటకు వచ్చి ఈ అద్బుత విషయం ప్రజలందరికి తెలియచేసారు&period; అక్కడకు వెళ్లి చూసిన ఆయా గ్రామ ప్రజలు కీకారణ్యంలో కొండలో గుహలో శివలింగం వెలసిన తీరు చూసి భక్తి పరవశులయి పూజలు చేయ ప్రారంభించారు&period; దేవతలు అంటే అమరులు ఆరాధించిన శివలింగం కాబట్టి అమర లింగేశ్వరస్వామి గాపేరు వచ్చినట్లు చెప్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79879 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;daida-amaralingeswara-swamy-temple&period;jpg" alt&equals;"daida amaralingeswara swamy temple important facts to know " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కొండ బిలం చూసిన ప్రతి వారు ఆశ్ఛర్యం పొందుతారు&period;ఇదంతా ఆ శివుని లీల అని భావిస్తారు&period;అప్పటి నుంచి ఈ దేవాలయానికి భక్తులు సంఖ్య పెరుగుతూ వచ్చింది&period; ప్రతి సోమవారం ఇక్కడ కు భక్తులు వచ్చి పొంగళ్లు పెట్టి శివున్ని ఆరాదించి ఇక్కడే నిద్ర చేస్తారు&period; అలా చేస్తే వారి కోరికలు తీరతాయని నమ్మకం&period; సంతానం లేనివారు&comma; రోగగ్రస్తులు ఈ స్వామి దర్శిస్తే సంతానం కలుగుతుందని&comma;అలాగే రోగాలు నయమవుతాని భక్తులు తమ ప్రత్యక్ష అనుభవాలు చెపుతారు&period; ఒకప్పుడు ఈ ప్రాంతానికి సరైన రవాణా మార్గంలే దు కాలి నడక గుండా నే అరణ్య మార్గాన వెళ్లాలి&period; అయినను భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారు&comma; నేడు కొంత వరకు ప్రయాణ సౌకర్యం బాగానే ఉంది&period; ఆటోలు&comma;కారులు వెళ్ళవచ్చు&period; పవిత్ర కృష్ణానదిలో స్నాన మాచరించి&comma; తడి బట్టలతోనే బిలంలోకి ప్రవేశించి శివుడిని ఆరాదిస్తారు&period; ఈ బిలంలోకి జట్టు&comma; జట్టులుగా లోపలికి వెల్తారు&period; ఎందుకంటే ఈ బిలంలో అనేక మార్గాలు ఉన్నవి&period; తప్పిపోయే ప్రమాదం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బిలం నుండి ఎత్తిపోతల&comma; కాశీ&comma; త్రిపురాంతకంలకు కూడాసొరంగం నుండి మార్గాలు ఉన్నట్లు పెద్దలు చెపుతారు&period; ముందు ఒకతను దారి చూపిస్తూ భక్తులను బిలంలోకి తీసుకెళ్లతాడు&period; ప్రస్తుతం బిలంలో విద్యుత్‌ సౌకర్యం కలదు&period; ఒక మనిషి మాత్రమే వెల్లేందుకు సన్నని మార్గం ఉంటుంది&period; ఒకరి వెనుక ఒకరు వెళ్లాలి&period; కొన్ని చోట్ల వంగుతూ&comma;మోకాళ్ల పైన కూడా లోపలికి వెళ్లాలి&period; బిలంలో అనేక మార్గాలు కనిపిస్తాయి&comma; ముందు తెలిసిన వారు వెళుతుండే వారి వెనుక అనుసరించాలి&period; శివలింగం ఉన్న ప్రదేశం మాత్రం 10 మంది కూర్చుని అభిషేకం చేసుకునేలా ఉంది&period; ఆ ప్రాంతం పంచాముఖాకృతిలో వాస్తు రీతిలో ఉంటుంది&period;à°¶à°¿ వునికి ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు&period; బిలంలోనే ఒక పక్క పార్వతి అమ్మగారి ప్రతిమ భక్తి భావం ఇంకా పెంచుతుం ది&period; ప్ర కృతి ప్రేమికులకు ఈ ప్రాంతం చూస్తే ముగ్దులవుతారు&period;రాత్రి వేళ ఇక్కడ నిద్ర చేసే భక్తులను ఆశీర్వదించటానికి ఇక్కడ శివుడు సంచరిస్తు ఉంటారని పెద్దలు చెపుతారు&period; మనోహర్‌ అడవి ప్రాంతం&comma;పరవళ్లు తొక్కే నీరు&comma;ప్రశాంత వాతావరణం కనులు విందు చేస్తుంది&period; ఒకప్పుడు బిలంలోకి పోవటానికి&comma; రావటానికి ఒకే మార్గం ఒకే మార్గం ఉండేది&comma; కాలక్రమేణా మరోదారి కనిపించగా బండ రాయి తొలగించగా మరో మార్గం కనిపించిందట&comma;అప్పుటి నుండి ఈ మార్గం గుండా భక్తులు బయటకు వస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts