వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

డైటింగ్ చేస్తూ బరువుతగ్గాలనుకుంటున్నారా? అదో పెద్ద తప్పు. అంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. మిమ్మల్ని బరువెక్కించేది కొవ్వు కాదు. అసలైన దొంగలు అధిక షుగర్, కార్బోహైడ్రేట్లు. ఫిట్ నెస్ నిపుణులు చాలామంది దీనితో ఏకీభవిస్తారు. మరి బలమైన సన్నని పొట్ట కావాలంటే పొట్ట వ్యాయామాలు చేయండి. దానితోపాటు సంతులిత ఆహారం తీసుకోండి. వ్యాయామాలు చేస్తూ వుంటే కొవ్వు తక్కువ ఆహారాలే కాదు. అధికంగా వుండేవి కూడా తీసుకోవచ్చు. మరి పలుచని బలమైన పొట్ట కావాలంటే ….తినే ఆహారం పోషకాలు పోయేట్లు అధికంగా ఉడికించేయకండి.

మీ ప్లేట్ లో 50 శాతం పచ్చిదే వుండాలి. తినగలిగితే అన్నీ కూరలు పచ్చివే తినండి. ఆర్గానిక్ మాంసం ఖరీదైనా మంచి ఆరోగ్యాన్నిస్తుంది. యాంటీబయాటిక్స్ అందులో తక్కువ. కండ పట్టాలంటే దీనినే తినాలి. మీ పొట్ట లోపలి గోడలను బలహీనపరచే ఆహారాలు తిని దానిని ఒక సంచిలా తయారు చేయకండి. షుగర్ తక్కువ మోతాదులో మంచి శక్తినిస్తుంది. ప్రతిరోజూ ఒకటి నుండి రెండు స్పూన్లు మాత్రమే వాడండి. తినే ఆహారంలో పీచు అధికంగా వుండేలా చూడండి. పీచులేకుంటే మలబద్ధకం ఏర్పడుతుంది.

take only daily one time satisfactory meals know why

కావలసినన్ని పచ్చికూరలు తినండి, రూమ్ టెంపరేచర్ లో వుండే మంచినీరు ప్రతిరోజూ అధికంగా తాగండి. మీకు తృప్తి కలిగే ఆహారాలు అపుడపుడూ తినటం మీ డైటింగ్ కు ఏమీ హానికలిగించదు. వాస్తవానికి అది మీ జీవక్రియ మెరుగుపరచి ఉత్సాహాన్నిస్తుంది. అయితే అన్నిటిని మించి సంతృప్తికరంగా రోజుకు ఒక భోజనం మాత్రం చేయాలనేది నిబంధనగా పెట్టుకోండి.

Admin

Recent Posts