ఆధ్యాత్మికం

Ghosts : దెయ్యాల్లోనూ ర‌కాలున్నాయ‌ట తెలుసా.. మొత్తం 22.. అవేమిటంటే..?

Ghosts : దెయ్యాలు.. అవును అవే. అస‌ల‌వి ఉన్నాయో లేదో తెలియ‌దు కానీ ఆ పేరు వింటే చాలు చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. దెయ్యాల గురించి మాట్లాడుకోవాలంటేనే చాలా మంది జంకుతారు. ఇక దెయ్యం సినిమాలు చూస్తే అంతే. విప‌రీత‌మైన భ‌యం క‌లుగుతుంది. అది సరే.. ఇప్పుడీ దెయ్యాల టాపిక్ ఎందుకు..? అంటారా..? ఏమీ లేదండీ.. చెట్లు, జంతువులు వంటి వాటిలో ర‌కాలు ఉన్న‌ట్టే ఈ దెయ్యాల్లో కూడా ర‌క‌ర‌కాలైన‌వి ఉంటాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇండియ‌న్ పారానార్మ‌ల్ సొసైటీకి చెందిన గౌర‌వ్ తివారీ అనే వ్య‌క్తి దెయ్యాల్లో ఎన్ని ర‌కాలు ఉంటాయో చెప్పారు. వాటిలో మొత్తం 22 ర‌కాలు ఉంటాయ‌ట‌. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. భూతం – భూతం అంటే నిజానికి దెయ్యం కాదు. కొత్తగా జ‌న్మించిన శిశువును భూతం అంటార‌ట‌. శిశువు జ‌న్మించే స‌మయంలో ఆ దేహంలోకి ఓ ఆత్మ వ‌చ్చి చేరుతుంద‌ట‌. దాన్నే భూతం అంటారు. అలా భూతం చేరిన శిశువును భూతం అనే అంటారు. ఆ వ్య‌వ‌ధి కొంత సేపు ఉంటుంది. ఆ త‌రువాత ఆ ఆత్మ‌కు పూర్వ జ్ఞానం పోతుంది. అప్పుడు శిశువుకు ఏమీ తెలియ‌వు. గుర్తుండ‌వు. 2. ప్రేతం – ఇంట్లో ఉండే కుటుంబ స‌భ్యుల హింస వ‌ల్ల మ‌రణించిన‌వారు, శ్మ‌శానంలో స‌రిగ్గా ద‌హ‌నం అవ‌ని మృత‌దేహాలు ప్రేతాలుగా మారుతాయట‌. 3. చుడెయిల్ – ఉత్త‌ర భార‌త దేశంలో దీని గురించి న‌మ్ముతారు. ఇలాంటి దెయ్యాలు ఎక్కువ‌గా మర్రి చెట్ల మీద త‌ల‌కిందులుగా వేలాడుతూ ఉంటాయ‌ట‌. దారిన వ‌చ్చీ పోయే వారిని భ‌య‌పెట్టి, బెదిరిస్తాయ‌ట‌.

ghosts are this many types do you know about them

4. కొల్లిదేవా – ఈ దెయ్యం గురించి క‌ర్ణాట‌క వాసులు న‌మ్ముతారు. ఇలాంటి దెయ్యాలు అడ‌వుల్లో ఎక్కువ‌గా ఉంటాయి. రాత్రిపూట చేతిలో టార్చి లైట్‌ను ప‌ట్టుకుని అటు ఇటు తిరుగుతుంటాయ‌ట‌. 5. హ‌డ‌ల్ – ఇవి దెయ్యాలే కానీ మ‌నుషుల‌కు హాని చేయ‌వు. బిడ్డ‌కు జ‌న్మినిచ్చే స‌మ‌యంలో చ‌నిపోయిన మ‌హిళ‌లు ఈ దెయ్యాలుగా మారుతార‌ట‌. 6. చెట్‌కిన్ – ఈ దెయ్యాలు మ‌నుషుల‌ను లొంగ‌దీసుకుని వారిని యాక్సిడెంట్ల‌లో చ‌నిపోయేలా చేస్తాయ‌ట‌. ఒక ర‌కంగా చెప్పాలంటే హిప్నాటిజం అన్న‌మాట‌. అలాంటి స్థితిలో మ‌నుషులు త‌మ‌కు తామే యాక్సిడెంట్‌లో చ‌నిపోతార‌ట‌.

7. కుట్టి చేతాన్ – చ‌నిపోయిన చిన్న‌పిల్ల‌ల ఆత్మ‌ల‌ను కుట్టిచేతాన్ అంటార‌ట‌. వీరిని ఎక్కువ‌గా తాంత్రికులు త‌మ గుప్పెట్లో పెట్టుకుని వారు చెప్పిన‌ట్టు చేసేలా ఆడిస్తార‌ట‌. 8. బ్ర‌హ్మ‌దైత్య – ప‌శ్చిమ‌బెంగాల్ వాసులు ఈ త‌ర‌హా దెయ్యాల‌ను న‌మ్ముతారు. చ‌నిపోయిన బ్రాహ్మ‌ణుల ఆత్మ‌లు ఈ దెయ్యాలుగా మారుతాయ‌ట‌. 9. మోహిని – బాగా ప్రేమించిన వారు చ‌నిపోతే మోహిని దెయ్యాలుగా మారుతార‌ట‌. 10. విరికాస్ – అడ‌వుల్లో నివ‌సిస్తూ పెద్ద ఎత్తున ఏడుపులు, వింత శ‌బ్దాలు చేస్తాయ‌ట ఈ దెయ్యాలు. 11. శాకినీ – వివాహం అయిన కొద్ది రోజుల‌కే మ‌రణించే మ‌హిళ‌లు శాకినీ దెయ్యాలుగా మారుతార‌ట‌. ఈ దెయ్యాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌. 12. ఢాకినీ – మోహ‌నీ, శాకినీ రెండు దెయ్యాలు క‌లిపితే అప్పుడు ఢాకినీ దెయ్యం అవుతుంది. ఇవి చాలా ప్ర‌మాద‌క‌రం.

13. సంకోధోక్తాస్ – ట్రెయిన్ ప్ర‌మాదాల్లో చ‌నిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారుతార‌ట‌. అలా అని బెంగాల్ వాసులు న‌మ్ముతారు. 14. నిశి – ఈ దెయ్యాలు ఎక్కువ‌గా చీక‌ట్లోనే తిరుగుతాయ‌ట‌. వీటిని కూడా బెంగాల్ వాసులు న‌మ్ముతారు. 15. కిచ్చిన్ – ఈ దెయ్యాల‌ను బెంగాల్ వాసులు న‌మ్ముతారు. ఇవి చాలా ఆక‌లితో, కోపంగా ఉంటాయ‌ట‌. 16. పందుబ్బ – బీహార్ వాసులు ఈ దెయ్యాల‌ను న‌మ్ముతారు. న‌దుల్లో మునిగి చనిపోయిన వారు ఈ దెయ్యాలుగా మారుతార‌ట‌. 17. బుర డాంగోరియా – అస్సాంలో ఈ దెయ్యాల గురించి న‌మ్ముతారు. ఇవి తెల్ల‌ని డ్రెస్‌లో త‌ల‌కు క‌ట్టు క‌ట్టుకుని గుర్రంపై వెళ్తూ ఉంటాయ‌ట.

18. బాక్ – ఈ దెయ్యాల‌ను అస్సాం వాసులు న‌మ్ముతారు. ఇవి ఎక్కువ‌గా చిన్న‌పాటి చెరువులు, స‌ర‌స్సుల వ‌ద్ద ఉంటాయ‌ట‌. 19. ఖాబీస్ – పాకిస్థాన్‌, గ‌ల్ఫ్ దేశాలు, యూర‌ప్ దేశాల్లో ఈ దెయ్యాల‌ను నమ్ముతారు. ఈ దెయ్యాల‌కు కామ‌రూప శ‌క్తి ఉంటుందట‌. అంటే తాము ఏ రూపంలో కావాల‌నుకుంటే ఆ రూపంలోకి ఈ దెయ్యాలు మారుతాయ‌ట‌. 20. బీరా – ఈ దెయ్యాల‌ను అస్సాం వాసులు న‌మ్ముతారు. ఈ దెయ్యాలు త‌మ కుటుంబ స‌భ్యుల చుట్టూ తిరుగుతాయ‌ట‌. 21. జోఖిని – ఈ దెయ్యాల‌ను అస్సాం వాసులు న‌మ్ముతారు. ఈ దెయ్యాలు ఎక్కువగా మ‌గ‌వారిని చంపుతాయ‌ట‌. 22. పువాలి భూత్ – ఈ దెయ్యాలు ఇండ్ల‌లో ఉండే వ‌స్తువుల‌ను దొంగిలిస్తాయ‌ట‌.

Admin

Recent Posts