ఆధ్యాత్మికం

Lord Shani Dev : శ‌నికి ఇష్టం లేని ప‌నులు ఇవి.. చేశారంటే అంతే సంగ‌తులు..!

Lord Shani Dev : ఎవ‌రి జాత‌కం అయినా చెప్పాలంటే.. అందుకు ముందుగా గ్ర‌హ సంచారం ఎలా ఉందో చూస్తారు. న‌వ‌గ్ర‌హాల సంచారాన్ని బ‌ట్టి జాత‌కం నిర్ణ‌యిస్తారు. ఎవ‌రి జాత‌కంలో అయినా ఉంటే గ్ర‌హ‌దోషాలు ఉంటాయి. క‌నుక ఆయా దోషాల‌కు అనుగుణంగా ప‌రిహారాలు చేయిస్తుంటారు. అయితే న‌వ‌గ్ర‌హాల్లో శ‌ని గ్ర‌హం కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే శ‌నివారం నాడు కొన్ని ప‌నులు చేయ‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌దు. ఆ ప‌నులు చేస్తే క‌చ్చితంగా శ‌ని చుట్టుకుంటుంది. క‌నుక శ‌నివారం చేయ‌కూడ‌ని ప‌నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ‌నివారం నాడు ఇంటి ముందు అప‌రిశుభ్రంగా ఉంటే శ‌ని ఆ ఇంట్లోకి ప్ర‌వేశిస్తాడు. క‌నుక ఆ రోజు త‌ప్ప‌నిస‌రిగా ఇంటిని, ఇంటి ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంటి ముందు చెప్పులు, చెత్త‌బుట్ట పెట్ట‌రాదు. ఇలా పెడితే శ‌నికి న‌చ్చ‌దు. ఆయ‌న నేరుగా ఇంట్లోకే వ‌స్తాడు. దీంతో స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. అలాగే శ‌నివారం నాడు ఇంట్లో ఏడుపులు, పెడ‌బొబ్బ‌లు, గొడ‌వ‌లు ఉంటే.. శ‌ని ఇంట్లోకి ప్రవేశిస్తాడు. శ‌నివారం నాడు ఎవ‌రినీ ఇబ్బంది పెట్ట‌కూడ‌దు. పెడితే వారి శ‌ని మ‌న‌కు చుట్టుకుంటుంది. క‌నుక ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.

lord shani does not like these persons

శ‌నివారం నాడు కోపంగా ఉంటే శ‌ని బాధ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాగే శ‌నివారం వెంక‌టేశ్వ‌ర స్వామికి పూజ చేసి హార‌తి ఇస్తే శ‌ని ప్ర‌భావం ఉండ‌దు. శివాభిషేకం కూడా చేయ‌వ‌చ్చు. ఇక శ‌నివారం రోజు వీధి కుక్క‌ల‌కు భోజనం పెడితే శ‌ని ఎంతో సంతోషిస్తాడు. మ‌న‌ల్ని ఏమీ చేయ‌డు. శ‌నివారం నాడు నువ్వుల నూనెను కొని ఇంటికి తేరాదు. శ‌నివారం న‌లుపు రంగు దుస్తుల‌ను ధ‌రించ‌రాదు. అలాగే చీపురు శ‌ని దేవుడి ఆయుధం. క‌నుక దాన్ని కాళ్ల‌తో తొక్క‌రాదు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ప‌డేయ‌రాదు. ఇలా ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే శ‌ని దేవుడి ఆగ్ర‌హానికి గురి కాకుండా త‌ప్పించుకోవ‌చ్చు. దీంతో శ‌ని నుంచి పుణ్యం ల‌భిస్తుంది. క‌నుక శ‌నిగ్ర‌హం విష‌యంలో ఈ సూచ‌న‌ల‌ను తప్ప‌క పాటించాలి.

Admin

Recent Posts