హెల్త్ టిప్స్

Eye Sight : ఈ చిన్న ట్రిక్ పాటిస్తే కంటి అద్దాలు వాడాల్సిన ప‌ని ఉండదు.. కంటి చూపు 100 శాతం పెరుగుతుంది..

Eye Sight : నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో కంటి చూపు కూడా ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి ఈ స‌మస్య వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకీ కంటి అద్దాలను పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కంటి స‌మ‌స్య‌లు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం పోష‌కాహార లోప‌మే. దీని వ‌ల్లే ఆ స‌మ‌స్య వ‌స్తోంద‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా నిత్యం స‌రైన పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. అయితే దీంతోపాటు కింద చెప్పిన ఓ చిట్కా పాటిస్తే దాంతో కూడా కంటి ఆరోగ్యాన్ని ఇంకా మెరుగు పరుచుకోవ‌చ్చు. దీంతో కంటి స‌మ‌స్య‌లు పోతాయి. చూపు బాగా వ‌స్తుంది. మ‌రి ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

కావల్సిన పదార్థాలు..

బాదం ప‌ప్పు, సోంపు, కండ చ‌క్కెర (పటిక బెల్లం).

follow this tip to increase eye sight and remove glasses

త‌యారీ విధానం..

ఈ మూడింటినీ విడి విడిగా సమాన భాగాల్లో తీసుకోవాలి. సోంపు, బాదం ప‌ప్పులను విడి విడిగా దోరగా వేయించుకోవాలి. మూడింటినీ పొడిగా చేసి క‌లిపి ఓ గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన పొడిని పెద్దవారయితే రెండు టీ స్పూన్ల పొడిని, పిల్లలయితే ఒక టీ స్పూన్ పొడిని ఒక గ్లాస్‌ పాలలో కలుపుకుని తాగాలి. ఇలా రోజుకి రెండు సార్లు తీసుకోవాలి. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మూడు నెలల్లోనే కంటి చూపు అనూహ్యంగా మెరుగవుతుంది. ఈ క్ర‌మంలో ఒక ఆరు నెలల పాటు ఈ పొడి తాగితే కంటి చూపు బాగా పెర‌గ‌డ‌మే కాదు, నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి. కంటి అద్దాలు వాడాల్సిన ప‌ని ఉండ‌దు.

ఇక పైన చెప్పిన పొడిని తాగ‌డం వ‌ల్ల కేవలం కంటి స‌మ‌స్య‌లు మాత్ర‌మే కాదు, ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. దీంతో ఎముక‌లు, కండ‌రాలు బ‌లోపేతం అవుతాయి. శ‌రీరంలో వేడి త‌గ్గిపోతుంది. ఈ పొడితోపాటు ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, ఆకు కూర‌లు, న‌ట్స్‌, క్యారెట్లు, క్యాబేజీ, బీట్ రూట్‌, నిమ్మ కాయ‌లు, తృణ ధాన్యాలు, బ్రొకొలి, చేప‌లు, ట‌మాట వంటి ఆహారాల‌ను నిత్యం తీసుకుంటూ ఉంటే దాంతో కంటి చూపును మెరుగుప‌రుచుకోవ‌చ్చు.

Admin

Recent Posts