ఆధ్యాత్మికం

సూర్యగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు చేయకూడని పనులు ఇవే

ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో పండ్లు తప్పక తినాలి. ఎందుకంటే పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పోషక పదార్థాలు అనేకంగా ఉంటాయి. అవి గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరం. కాబట్టి వీటిని తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే సూర్యగ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు. శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇది శుభ పరిణామం కాదని చెబుతూ ఉంటారు. అందువల్లనే సూర్యగ్రహణం రోజున కొన్ని పనులను చేయకూడదని వారు అంటున్నారు.

అమావాస్య రోజున చంద్రుడు, సూర్యుడు భూమి మధ్య పడినప్పుడు ఆ స్థానాన్ని సూర్యగ్రహణం అంటారు. సూర్యగ్రహణం అనేది ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని వారు అంటున్నారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదని చెబుతూ ఉంటారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం పడుతుందని నమ్ముతారు. సూర్యగ్రహణం సమయంలో అనేక కిరణాలు ఉద్భవిస్తాయి. ఈ హానికరమైన తరంగాలు పుట్టే బిడ్డపై కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని, అందుకే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలని అంటుంటారు.

pregnant ladies should not do these on solar eclipse

అంతే కాకుండా గ్రహణం సమయంలో వీలైనంతవరకు ఏమీ తినకపోవడం, ఏ పని చేయకపోవడం, నిద్రపోకపోవడం మంచిదని చెబుతూ ఉంటారు.

Admin

Recent Posts