ఆధ్యాత్మికం

Lakshmi Devi And Gold : బంగారాన్ని ఈ రోజుల్లో కొంటే ఎంతో మంచిది.. ల‌క్ష్మీదేవి మీ వెన్నంటే ఉంటుంది..!

Lakshmi Devi And Gold : బంగారం అంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. స్త్రీలే కాదు పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాలను ధ‌రించేందుకు ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. అందులో భాగంగానే కొందరు పురుషులు ఒంటి నిండా బంగారు న‌గ‌ల‌తో మ‌న‌కు ప‌లుమార్లు అక్క‌డ‌క్క‌డా ద‌ర్శ‌న‌మిస్తుంటారు కూడా. అయితే బంగారాన్ని సాక్షాత్తూ మ‌హాల‌క్ష్మీ దేవికి ప్ర‌తిరూపంగా చెబుతారు. అందువ‌ల్ల బంగారం కొనే విష‌యంలోనూ మ‌నం జాగ్ర‌త్త‌లు పాటించాలి. ముఖ్యంగా బంగారాన్ని ప‌లు ప్ర‌త్యేక‌మైన రోజుల్లోనే కొనాల్సి ఉంటుంది. అప్పుడే మ‌న‌కు ఇంకా సంప‌ద సిద్ధిస్తుంది. ల‌క్ష్మీదేవి మ‌న‌ల్ని అనుగ్ర‌హిస్తుంది. ఇక బంగారాన్ని ఏయే రోజుల్లో కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారాన్ని లేదా న‌గ‌ల‌ను సంవ‌త్స‌రంలో కొన్ని ప్ర‌త్యేక‌మైన రోజుల్లోనే కొనాలి. ముఖ్యంగా పుష్య‌మి న‌క్ష‌త్రం ఉండే రోజుల్లో, సంక్రాంతి, ఉగాది, అక్ష‌య త్రితీయ‌, ద‌స‌రా న‌వ‌రాత్రులు, ద‌స‌రా రోజు, ధంతేరాస్ వంటి రోజుల్లో బంగారాన్ని కొనాలి. దీంతో మ‌న‌కు ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది. ఆయా రోజుల్లో బంగారాన్ని కొంటే సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి మ‌న ఇంటికి వ‌చ్చిన‌ట్లే. దీంతో మ‌న‌కు అమ్మ‌వారి అనుగ్ర‌హం క‌లుగుతుంది. మ‌నం ధ‌నం మ‌రింత ఎక్కువ‌గా సంపాదిస్తాము. ఐశ్వ‌ర్య‌వంతులుగా మారేందుకు అవ‌కాశం ఉంటుంది.

purchase gold in these days lakshmi devi will always be with you

అయితే పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాలు చేసుకునేవారు ఆయా రోజుల్లో ముహుర్తాలు పెట్టుకోక‌పోవ‌చ్చు క‌దా, మ‌ర‌లాంట‌ప్పుడు ఆయా రోజుల్లో బంగారాన్ని ఎలా కొంటాం ? అంటే.. శుభ‌కార్యాల స‌మ‌యంలో బంగారాన్ని కొన‌డం త‌ప్ప‌దు. క‌నుక ఆ రోజుల్లో పైన చెప్పిన నియ‌మాన్ని పాటించాల్సిన ప‌నిలేదు. పెళ్లిళ్లు వంటి కార్యాల స‌మ‌యంలో మ‌నం ఎప్పుడంటే అప్పుడు బంగారాన్ని కొన‌వ‌చ్చు. కానీ నిర్దిష్టంగా ఇత‌ర రోజుల్లో బంగారాన్ని కొన‌ద‌లిస్తే మాత్రం పైన చెప్పిన విధంగా ప‌లు ప్ర‌త్యేక‌మైన రోజుల్లో, ప‌ర్వ‌దినాల్లో బంగారాన్ని కొన‌డం మంచిది. దీంతో మ‌న‌కు అన్ని విధాలుగా క‌ల‌సి వ‌స్తుంది. ల‌క్ష్మీదేవి మ‌న ఇంట్లోనే ఉంటుంది.

Admin

Recent Posts