మీకిష్టమైన కాక్ టెయిల్స్ రాత్రి 12 గంటలవరకు పూర్తి చేస్తున్నారా? లావెక్కకూడదనుకుంటే ఆపై తినేదానిపై శ్రధ్ధ పెట్టండి. పొట్ట నిండిన సంగతి గ్రహించండి. మందుమత్తులో తింటూ పోతే డైలీ కేలరీలు అధికంగా లోపలికిపోతాయి. ఖాళీ పొట్టతో తాగకండి. అది వెంటనే మత్తెక్కిస్తుంది. ఇష్టమైన, ఆరోగ్యకరమైన డిష్ తిని మందు తాగితే…ఒళ్ళు మరచి తాగటం వుండదు.
మందు కొట్టేటపుడు మధ్య మధ్య నీరు బాగా తాగండి. పొట్ట ఫుల్ గా అనిపిస్తుంది. ప్రతి రెండు నిమిషాలకు మరో స్మాల్ లేదా లార్జ్ కావాలనిపించదు. ఇలా నీరు తాగితే మరుసటి రోజు హేంగోవర్ వుండదు.
మీ బలహీనత తెలుసుకోండి. తినటంలో, తాగటంలో మితం పాటించండి. ఇది ఆనందం ఇస్తుంది. కేలరీలు అధికంగా వుండే డ్రింకులు వదలండి. జ్యూస్, క్లబ్ సోడా వంటివి మిక్స్ చేయకండి. చేస్తే కేలరీలు పెంచుతాయి. ఆరోగ్య లక్ష్యాలు గ్రహించండి. సోషల్ సర్కిల్ అంటూ వారాల తరబడి తాగేయకండి.