ఆధ్యాత్మికం

Dishti : రాళ్ల ఉప్పు, నిమ్మ పండు, ఎండు మిరపకాయలతో ఇలా చేస్తే చాలు.. మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు పోతాయి..!

Dishti : జీవితం అన్నాక కష్టాలు ఉంటాయి. సుఖాలు ఉంటాయి. కొందరికి అన్నీ కలిపి ఉంటాయి. కానీ కొందరికి మాత్రం నిరంతరం సుఖాలే ఉంటాయి. కొందరికి నిరంతరం కష్టాలే వస్తుంటాయి. ఏం చేసినా కష్టాల నుంచి బయట పడలేకపోతుంటారు. అయితే ఇందుకు వారి పొరపాటు ఏమీ ఉండదు. కానీ ఇంట్లో ఏవైనా దోషాలు ఉన్నా లేదా ఇంట్లో ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా ఇలాగే జరుగుతుంది. దీంతో ఏ పనీ పూర్తవదు. ఏదీ కలిసి రాదు. అన్నింటా నష్టాలే వస్తుంటాయి. పైగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుండదు. ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఉంటే వారు ఏమాత్రం ఆలస్యం చేయరాదు. కింద చెప్పిన విధంగా వెంటనే పరిహారం చేయాల్సి ఉంటుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గృహంలోని ప్రతికూల శక్తులకు చెక్‌ పెట్టేలా ఉప్పు, ఎండు మిరపకాయలు పనిచేస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఆదాయం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అనారోగ్య సమస్యలు వేధించడం వంటివి ప్రతికూల శక్తులు ఇంట్లో ఉన్నాయని చెప్పేందుకు ఉదాహరణలుగా భావించవచ్చు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సి ఉంటుంది.

remove dishti with lemon and mirchi and salt

రాళ్ల ఉప్పు, నాలుగు ఎండు మిరపకాయలు, ఒక నిమ్మపండు, ఒక గాజు గిన్నె తీసుకోవాలి. ఈ పరిహారాన్ని మంగళవారం పూట చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును నింపాలి. తరువాత ఒక నిమ్మ పండును రాళ్ల ఉప్పుపై ఉంచాలి. తరువాత నాలుగు ఎండు మిరపకాయలను ఉప్పుకు నాలుగు వైపులా నిలబెట్టాలి. దీంతో చిత్రంలో వచ్చిన విధంగా ఏర్పడుతుంది. ఇక ఇలా చేయడం వల్ల పరిహారం పూర్తవుతుంది. ఇలా ప్రతి మంగళవారం చేయాలి.

మిరపకాయల చివర్లు ఇంట్లోని ప్రతికూలతలను, దుష్ట శక్తులను తొలగిస్తాయి. అలాగే వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల తప్పక ఫలితం కనిపిస్తుంది. ఆశించిన రీతిలో అన్నీ అనుకూలిస్తాయి. ఇంట్లో నుంచి దుష్టశక్తులు వెళ్లిపోతాయి. ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఏది చేసినా కలసి వస్తుంది. అందరి ఆరోగ్యం బాగుంటుంది. ధనం బాగా సంపాదిస్తారు. కనుక ఇలా చేసి ప్రయోజనాలను పొందవచ్చు.

Admin

Recent Posts