ఆధ్యాత్మికం

పిల్ల‌లు క‌ల‌గ‌ర‌ని డాక్ట‌ర్లు చెప్పినా స‌రే ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే సంతానం క‌లుగుతుంద‌ట‌..!

సంతానం కోసం అనేక మంది దంప‌తులు క‌ల‌లు కంటుంటారు. ప్ర‌స్తుతం చాలా మంది సంతానం లేక బాధ‌ప‌డుతున్నారు. వైద్య ప‌రీక్ష‌ల్లో అన్నీ స‌క్ర‌మంగా ఉన్న‌ట్లు వ‌చ్చినా పిల్ల‌లు ఎందుకు క‌ల‌గ‌డం లేద‌ని చింతిస్తుంటారు. అయితే అలాంటి వారు ఒక్క‌సారి ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే ఎలాంటి దంప‌తుల‌కు అయినా స‌రే పిల్ల‌లు పుడ‌తార‌ట‌. అలా అని ఇక్క‌డి స్థ‌ల పురాణ‌మే చెబుతోంది. ఇంత‌కీ ఆ ఆల‌యం ఏమిటి.. ఎక్క‌డ ఉందంటే..

ఈ ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, చేబ్రోలు నుండి 6 కి.మీ దూరంలో ఉన్న ఎ. మల్లవరం గ్రామంలో ఉంది. చేబ్రోలు NH214లో కాకినాడ‌, తుని మధ్య ఉంది. కాకినాడ‌, తుని, అన్నవరం, పిఠాపురం నుండి చేబ్రోలు వరకు సాధారణ APSRTC బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆలయానికి చేరుకోవడానికి చేబ్రోలులో ఆటోలు అందుబాటులో ఉన్నాయి. రైలు ద్వారా.. చెన్నై కోల్‌కతా మార్గంలో పిఠాపురం, సామర్ల‌కోట‌, అన్నవరం ప్రధాన రైల్వే స్టేషన్‌లు. హైదరాబాద్ చెన్నై, హౌరా, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు రైళ్లు నడుస్తాయి. విమానంలో వైజాగ్ ఎయిర్ పోర్టుకు వ‌చ్చి అక్క‌డి నుంచి కూడా ఈ ఆల‌యానికి చేరుకోవ‌చ్చు.

subramanya swamy temple mallavaram

స్థ‌ల పురాణం ప్ర‌కారం ఒక‌ప్పుడు ఈ ఆల‌యంలో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని చుట్టుకుని ఒక నాగుపాము ఎల్ల‌ప్పుడూ ఆల‌యంలోనే ఉండ‌ద‌ట‌. కొల‌నులో స్నానం చేసి వ‌చ్చి స్వామి దగ్గ‌ర ఉండేద‌ట‌. అయితే పిల్ల‌లు క‌ల‌గ‌ర‌ని డాక్ట‌ర్లు స‌ర్టిఫై చేసినా స‌రే ఈ ఆలయానికి వ‌చ్చి ఆ నాగుపామును ద‌ర్శించుకుంటే పిల్ల‌లు క‌లిగేవార‌ని, దీంతో త‌మ సంతానంతో భార్యాభ‌ర్త మ‌ళ్లీ ఈ ఆల‌యానికి వ‌చ్చి మొక్కులు చెల్లించుకుంటార‌ని చెబుతారు. అంత‌టి ఘ‌న‌త ఈ ఆల‌యం సొంతం. కాల‌క్ర‌మేణా ఆ పాము అక్క‌డే శ‌రీరం వ‌ద‌ల‌డంతో దాని స్థానంలో అక్కడే ఒక ప్ర‌తిమ‌ను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. కాబ‌ట్టి సంతానం క‌ల‌గానుకునే దంప‌తులు క‌చ్చితంగా ద‌ర్శించాల్సిన క్షేత్రం ఇది.

Admin

Recent Posts