ఆధ్యాత్మికం

మీ శ‌త్రువులు మీకు క‌ల‌లో క‌నిపిస్తున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..

కలలో మనకు కనిపంచే అంశాలు మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. మన ప్రమేయం లేకుండా వచ్చే మనకు వచ్చే కలల వెనకాల అర్థం ఉంటుందని పండితులు చెబుతుంటారు. ఇక స్వప్నశాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కలలో కొన్ని భయపెట్టే అంశాలు ఉంటే, మరికొన్ని సంతోషాన్ని ఇస్తాయి. అయితే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుంది. మరి కలలో మన శత్రువులు కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

కలలో మీకు ఒకవేళ మీ శత్రువులు లేదా మీకు నచ్చని వ్యక్తులు కనిపిస్తే.. మీ సంబంధ బాంధవ్యాల గురించి మీకు అందుతున్న సందేశంగా భావించవచ్చని నిపుణులు అంటున్నారు. మీకు కలలో నిత్యం శత్రువులు కనిపిస్తే.. ఏవో పరిష్కారం కాని వివాదాలు మీలో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మీరు మరింత పై స్థాయికి ఎదగాలన్న‌ సందేశాన్ని కూడా ఈ మెసేజ్‌ ఇస్తుంది. మీకు నిజ జీవితంలో శత్రువులు ఎవరూ లేకపోయినా తెలియని వ్యక్తితో గొడవ పడుతున్నట్లు కల వస్తే త్వరలోనే మీరు ఏవో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని అర్థం చేసుకోవాలి. పలు విషయాల్లో జాగ్రత్త వహించాలని పండితులు సూచిస్తున్నారు.

what happens if you see your enemies in your dreams

ఇక మీతో మీరే గొడవ పడుతున్నట్లు కల వస్తే.. మీ మనసులో తెలియని ఏవో భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంగా ఏదో సమస్యతో వెంటాడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే కేవలం శత్రువులతోనే కాకుండా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నట్లు కలలో కనిపిస్తే.. చెడు సంకేతంగా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మీ పనిలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం. పనులు అర్థాంతరంగా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి.

కలలో ఇతరులతో గొడవ పడుతున్నట్లు కనిపిస్తే.. మీ పురోగతికి అడ్డుకట్ట పడబోతుందని అర్థం చేసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి ఏదో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు వస్తే తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Admin

Recent Posts