భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైంది ఏం కాదు. ఇది మన హిందూ సాంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులని మనం వాడుతుంటాం. పిల్లలకి దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం, కాలికి పెట్టడం, అదేవిధంగా మనం కూడా బయటికి వెళ్లినప్పుడు పాదానికి దిష్టి తగలకుండా పెట్టడం, ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రంగును ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని వాడతారు.
ఈ నేపథ్యంలోనే పాదం పై భాగంలో మెడ, నడుము, మనికట్టు చుట్టూ ఇలా అనేక ప్రదేశాల్లో వీటిని కట్టుకుంటారు. ఇలా కట్టడం ఫ్యాషన్ గా అని కూడా యూత్ భావిస్తుంటుంది. అదేవిధంగా, నల్ల దారాన్ని మొలతాడుగా నడుముకి కట్టుకుంటారు. కాలికి కూడా కట్టుకుంటారు. ఇది ఎందుకంటే నడుముకి కట్టడం వల్ల పొట్ట పెరగకుండా, నడుము పరిమాణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని అంటారు.
దీంతో పాటే వెన్నునొప్పి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు. నడుము కు కట్టినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇది టైట్ గా అయితే, బరువు పెరిగినట్లేనని భావించవచ్చు. ఈ టైంలో మనం ఈ కొలత ప్రకారం బరువు తగ్గాలని భావించచ్చట. కాలికి నల్ల దారం ధరించడం వల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి బరువు తగ్గే ఆస్కారం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.