ఆధ్యాత్మికం

కొబ్బరికాయ కొట్టిన‌ప్పుడు కుళ్లిపోయి ఉంటే ఏం జ‌రుగుతుంది.. పువ్వు వ‌స్తే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పూజ చేసాక దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మన ఆచారం&period; పూజ పూర్తయ్యాక టెంకాయ కొట్టేసాము&comma; నైవేద్యం పెట్టేసాము తంతు పూర్తి అయింది అని అనుకుంటాము&period; కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది&period; టెంకాయ కొట్టడం అంటే శాంతి కారకం&comma; అరిష్ట నాశకం&period; శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి&period; కొందరికి కొబ్బరికాయ సరిగ్గా పగులుతుంది అంటే వారికి టెక్నిక్ అర్థం అయి ఉంటుంది&period; లేదా వారు శ్రద్ధగా కొట్టి ఉండవచ్చు&period; కొంతమంది మనసులో ఆందోళనలు&comma; భయాలతో కొబ్బరికాయలు కొడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాంటప్పుడు అది అడ్డదిడ్డంగా పగులుతుంది&period; దీన్ని మంచి లేదా చెడుకు అన్వయించుకోవాల్సిన అవసరం లేదు&period; ఇక కొంతమంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతుంది&period; దీన్ని చెడుగా భావిస్తారు&period; కొబ్బరికాయ కుళ్ళిపోతే కాళ్ళు&comma; చేతులు కడుక్కుని పూజామందిరాన్ని శుభ్రం చేసి మరొక కొబ్బరికాయ కొట్టడం మంచిది&period; అలాగే కొంతమంది వాహనాలకు పూజ చేసి కొబ్బరికాయ కొడుతుంటారు&period; ఇలాంటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే మనసులో ఏ భయాలు పెట్టుకోకుండా వాహనాన్ని శుభ్రం చేసి మరొక కొబ్బరికాయ కొట్టాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60937 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;coconut&period;jpg" alt&equals;"what happens when coconut is spoiled when we break it for pooja " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా కొట్టడం వలన మంచి జరుగుతుంది&period; అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచి జరుగుతుందని అర్థం&period; కొత్తగా పెళ్లయిన వారికి ఇలా పువ్వు వస్తే వారి జీవితం సుఖసంతోషాలతో సంతాన వృద్ధి కలుగుతుంది&period; ఇక కొబ్బరికాయ నిలువుగా పడవ ఆకారంలో పగిలితే ఆ ఇంట్లో ఉన్న కోడలు లేదా కూతురుకి గర్భధారణ జరగబోతుందని నమ్ముతారు&period; ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు మంచి మనసుతో ధర్మమైన కోరికలతో కొట్టడం వలన అవి నెరవేరుతాయి&period; చెడు ఆలోచనలతో ఆందోళన&comma; భయాలతో కొట్టడం వలన అవి నెరవేరవు&period; అందుకే దేవునిపై మనసు పెట్టి మంచిని మాత్రమే కోరుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts