ఆధ్యాత్మికం

అస‌లు నైవేద్యం అంటే ఏమిటి..? దీనికి ప్ర‌సాదానికి సంబంధం ఏమిటి..?

మన సాంప్రదాయాల ప్రకారం, మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. అయితే వీరంతా ఒకే చోట లేకపోయినప్పటికీ… ఒక్కో చోట ఒక్కో రకమైన దేవుడు కొలువై ఉన్నారు. మనం వీరిందరినీ కొలుస్తుంటాం. అంతేనా వీరికి ప్రత్యేక పూజలు చేస్తూ మన భక్తిని చాటుకుంటూ ఉంటాం. అందులో భాగమే ఈ నైవేద్యం సమర్పించడం కూడా. అయితే మనం దాదాపుగా అన్ని దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తుంటాం.

ఆలయాల్లో వుండే దేవతలు అమృతం తాగిన వారు కాదు. అమృతం అందించిన వారు. ఆలయాలలో మనం చేసే నివేదనలు ఆ విగ్రహాల ఆరగింపుకు కాదు, ఆ విగ్రహ రూపంలో వున్న దైవం అనుగ్రహించి మనకు అందజేసిన ఆహారాన్ని ఆ దైవానికి నివేదన చేసి మనం ఆరగించడానికి మాత్రమే..దేవతలకు నైవేద్యం సమర్పించవచ్చు. అంతే కాదండోయ్ ఆ ప్రసాదాన్ని మనం తిని పుణ్యం పొందవచ్చు.

what is the difference between prasadam and naivedyam

నైవేద్యం అనేది భుజించడానికి ముందు దేవునికి ఆహారము సమర్పించు ప్రక్రియ. కావున దేవునికి ఆహారము సమర్పించే ముందు అంటే ఆ ఆహారము వండేటపుడు దాని రుచి చూడటము నిషిద్ధం. ఆహారమును దేవుని మూర్తి ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాతే మనం కూడా తినాల్సి ఉంటుంది. అయితే నైవేద్యానికి, ప్రసాదానికి చాలా తేడా ఉంది. నైవేద్యం అంటే మనం సమర్పించేది..ఇక ప్రసాదం అంటే దేవుడి సమక్షంలో తయారు చేసెది..నైవేద్యం పెట్టి పది మందికి పంచితే చాలా మంచిది.సకల దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Admin

Recent Posts