ప్రతిరోజూ మీరు తినే ఆహారంలో తినే ప్రతి వేయి కిలో కేలరీలకు కనీసం 14 గ్రాముల పీచు పదార్ధం వుండాలి. పీచు అధికంగా వుండే ఆహారాలు రక్తంలోని కొల్లెస్టరాల్ ను తగ్గిస్తాయి. ఓట్లు, గోధుమ బ్రెడ్, ఎండు బీన్స్, బఠాణీలు, పండ్లు, కూరలు వంటి వాటిలో ఫైబర్ అధికం. శాట్యురేటెడ్ కొవ్వులు వీలైనంత తగ్గించాలి. రెడ్ మీట్, వెన్న, నెయ్యి, కొవ్వు అధికంగా వుండే పాల ఉత్పత్తులునూనెలు వదిలివేయాలి. గుడ్డు సొన కూడా తినకండి.
మీరు తినే ఆహారంలో కొల్లెస్టరాల్ రోజుకు 300 మి.గ్రా.మించి వుండరాదు. కుక్కీలు, క్రేకర్లు, స్నాక్స్, బేకరీ ఉత్పత్తులు, సలాడ్ డ్రసింగ్ లు, వేపుడు ఆహారాలు, మైక్రోవేవ్ పాప్ కార్న్ వదలండి. సాధారణంగా కార్బో హైడ్రేట్లు తినవద్దని చెపుతారు. కాని మీరు తినే ఆహారంలో 60 శాతం కార్బోహైడ్రేట్లు కూడా వుండాలి. ప్రతిరోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం వంటివి చేయాలి.
స్విమ్మింగ్, సైకిలింగ్ లేదా ట్రెడ్ మిల్ వంటివి సత్వర ఫలితాలనిస్తాయి. అంతేకాక, ఎలివేటర్ల బదులుగా మెట్లు ఎక్కడం వంటి శారీరక శ్రమకలిగించేవి ఆచరించాలి. ఇప్పటికే మీరు చాలాకాలంగా వ్యాయామం చేయనివారైతే, వ్యాయామాలు మొదలు పెట్టేముందు డాక్టర్ ను సంప్రదించండి. ఇప్పటికే అధికబరువు కలవారు ఎప్పటికపుడు తమ బాడీ మాస్ ఇండెక్స్ సరి చూసుకుంటూ తగిన వ్యాయామాలు, పోషకాహారం నిపుణుల పర్యవేక్షణలో అమలు చేయాలి. తగ్గవలసిన బరువు ఒకేసారి కాకుండా, ప్రణాళిక మేరకు క్రమంగా తగ్గాలి.