ఆధ్యాత్మికం

నవగ్రహాల దర్శనం తరువాత చేయవలసిన పనులు.!

మన హిందూ మతం ఎంతో గొప్పది. ఏ మతంలో లేని, సంప్రదాయాలు, ఆచారాలు ఈ మతంలో ఉంటాయి. అయితే… హిందూ మతం ప్రకారం… నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా? వద్దా? కడుక్కుంటే ఎందుకు కడుక్కోవాలి? అనే సందేహాలు ఉన్నాయి. అయితే, నవగ్రహాల పూజ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అనేది ఏ శాస్త్రంలోనూ లేదు. ఏ ధర్మంలోనూ చెప్పలేదు.

నవగ్రహాల పూజ చేసి, అక్కడే కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయి అని చాలా మంది చెబుతుంటారు. కానీ, ఇవన్నీ నిజాలు కాదు. ఎందుకంటే, ఏ గుడికి వెళ్లేటప్పుడు కానీ, ముందే కాళ్లు కడుక్కుంటాం, తరువాత కడుక్కోమూ. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు స్నానం చేసి, మంచి వస్త్రాలను ధరించి, గుడికి వెళ్తాము. ఒకవేళ నవగ్రహాల గుడికి వెళ్లాలనుకున్నప్పుడు, ముందు నవగ్రహాల పూజ చేసుకొని, ఆ తర్వాత ప్రధాన గుడిని దర్శించుకొని, లేదంటే ముందు ప్రధాన గుడిని దర్శించుకుని, ఆ తర్వాత నవగ్రహాల పూజ చేసుకొని ఇంటికి రావాలి.

what we have to do after navagraha darshanam

అంతేకానీ, కాళ్లు కడుక్కోవడం అనేది ఎక్కడా లేదు. ఇంటి నుంచి గుడి దూరంగా ఉంటే, కాళ్లకు దుమ్ము ధూళి అంటుకుంటే, అప్పుడు గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవాలి. నవగ్రహ పూజ కూడా దేవుడి పూజ కిందికే వస్తుంది కాబట్టి, పూజ తర్వాత కాళ్లు కడుక్కోకూడదు. అది సరైన పద్ధతి కాదు. పూజ తరువాత నేరుగా ఇంటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్లొద్దు. ఎవరి ఇంటికి వెళ్లొద్దు.

Admin

Recent Posts