హెల్త్ టిప్స్

మీరు ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. వీటిని తినేట‌ప్పుడు జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే..

<p style&equals;"text-align&colon; justify&semi;">తరచుగా మనం తినే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం&comma; వికారం&comma; వాంతులు వంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది&period; తిన్న ఆహారంలో ఏది ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో సరిగా తెలియక తికమక పడుతుంటాం&period; అయితే మనం తీసుకుంటున్న ఆహారంలో ఏవి సరైనవి&period; ఆరోగ్యానికి మేలు చేసేవి ఏవి&period;&period; ఇబ్బందికి గురిచేసేవి ఏ పదార్థాలు అనేది తెలుసుకోవడం ముఖ్యం&period; ఎర్రగా చూసేందుకు అందంగా కనిపించే చెర్రీస్ రుచిలో పుల్లగా ఉంటాయి&period; ఇందులోని గింజలు గట్టిగా ఉండి లోపల ఉండే పదార్థం సైనైడ్‌లా పనిచేస్తుంది&period; పొరపాటున వాటిని తిన్నట్లయితే ఇది విషపూరితంగా మారే అవకాశం ఉంది&period; చెర్రీస్ తినేప్పుడు అందులోని గింజల్ని తినకూడదు&period; యాపిల్ తినేప్పుడు పొరపాటుగా ఒకటి రెండు గింజలు తింటే పర్వాలేదు కానీ మొత్తంగా కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటే కనుక యాపిల్ గింజల్లో సైనైడ్ ఉంటుంది&period; ఇది శ్వాస ఆడకుండా చేస్తుంది&period; మూర్చ రావచ్చు&comma; పరిస్థితి విషమిస్తే మరణానికి కూడా దారితీస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోగనిరోధక శక్తిని పెంచడానికి జలుబు&comma; ఫ్లూ లక్షణాలు&comma; మలబద్ధకాన్ని తగ్గించాలంటే ఎల్డర్ బెర్రీని సిరప్&comma; లేదా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు&period; కానీ ఈ పండ్లను&comma; ఈ చెట్టు బెరడు&comma; ఆకులు వీటిలో ఏవి తిన్నాకూడా ఇందులో లెక్టిన్&comma; సైనైడ్ రెండు రసాయనాలున్నాయి&period; వీటి కారణంగా వికారం&comma; వాంతులు&comma; విరేచనాలు అవుతాయి&period; మనం మసాలా దినుసుగా వాడే జాజికాయ కొద్ది పరిమాణంలో వాడితే ఏం కాదు కానీ అదే స్పూనుకు మించి తీసుకుంటే భ్రాంతులు&comma; మగత&comma; మైకము&comma; గందరగోళం&comma; మూర్చ వచ్చే ప్రమాదం ఉంది&period; ఇందులోని మిరిస్టిసిన్ అనే నూనె కారణంగా రెండు స్పూన్ల మొత్తంలో తీసుకుంటే శరీరానికి విషపూరితం కావచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82968 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;cherries&period;jpg" alt&equals;"if you are taking these foods then follow these safety tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళదుంపలు భూమిలో పండుతాయి&period; ఇందులో గ్లైకోఅల్కలాయిడ్ అనే విషపదార్థం ఉంటుంది&period; బంగాళాదుంప కాంతికి గరైనప్పుడు&comma; పాడైపోయినపుడు ఇవి ఆకుపచ్చగా మారుతాయి&period; దీనిని తింటే ఇందులోని అధిక గ్లైకోఅల్కలాయిడ్ కంటెంట్ వికారం&comma; విరేచనాలు&comma; గందరగోళం&comma; తలనొప్పి&comma; ఒక్కోసారి మరణం కూడా కలగవచ్చు&period; అన్ని రకాల బీన్స్‌లో లెక్టిన్ అత్యధిక సాంద్రత కలిగి ఉంటాయి&period; పచ్చి కిడ్నీ బీన్స్ తీసుకోడం వల్ల వికారం&comma; తలతిరుగుతున్నట్లుగా ఉంటుంది&period; అందుకే ఉడికించిన బీన్స్ మాత్రమే తీసుకోవాలి&period; మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ఆహారంలో స్టార్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మానసిక గందరగోళం&comma; మూర్చలు&comma; మరణానికి కారణం అవుతుంది&period; అడవిలోని పుట్టగొడుగులు అన్నీ సురక్షితం కాదు&period; వీటిలో కొన్ని రకాలను తినడం వల్ల కడుపు నొప్పి&comma; విరేచనాలు&comma; వాంతులు&comma; డీహైడ్రేషన్&comma; తీవ్రమైన దాహం&comma; కాలేయ వైఫల్యం&comma; కోమా&comma; ఒక్కోసారి మరణం కూడా జరగవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts