ఆధ్యాత్మికం

మొల‌తాడు ఎందుకు ధ‌రిస్తారు..?

హిందూ సాంప్ర‌దాయ‌మంటేనే వైవిధ్యాల‌కు మారు పేరు. దేశంలో అనేక మంది హిందూ మ‌తానికి చెందిన వారున్నా ఒక్కో ప్రాంతం వారు ఒక్కో విధ‌మైన ఆచార వ్య‌వ‌హారాల‌ను పాటిస్తారు. అయితే అన్ని ప్రాంతాల వారు పాటించే ఆచారాలు మాత్రం కొన్నే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక‌టి మొల‌తాడు ధ‌రించ‌డం. సాధార‌ణంగా చిన్న‌త‌నంలో ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ పిల్ల‌ల‌కు మొల‌తాడును క‌డ‌తారు. అయితే వ‌య‌స్సు పెరిగే కొద్దీ కేవ‌లం మ‌గ‌వారు మాత్ర‌మే దాన్ని ధ‌రిస్తారు. ఆడ‌వారు ధ‌రించ‌రు.

మొల‌తాడు ధ‌రించ‌డం వెనుక హిందూ సాంప్ర‌దాయంలో ఓ అర్థం దాగుంది. అదేమిటంటే చిన్న పిల్ల‌ల‌కు మొల‌తాడు క‌డితే వారు ఎదుగుతున్న స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు స‌రైన ప‌ద్ధ‌తిలో వృద్ధి చెందుతాయ‌ట‌. ప్ర‌ధానంగా మ‌గ పిల్ల‌ల్లో పెరుగుద‌ల స‌మ‌యంలో పురుషాంగం ఎటువంటి అస‌మ‌తుల్యానికి గురికాకుండా క‌చ్చిత‌మైన పెరుగుద‌ల ఉండేందుకు మొల‌తాడును క‌డ‌తార‌ట‌.

why people wear molathadu

మొల‌తాడు క‌ట్టుకుంటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. మ‌గ‌వారికి హెర్నియా రాకుండా మొల‌తాడు కాపాడుతుంద‌ట‌. దీన్ని ప‌లువురు సైంటిస్టులు కూడా నిరూపించారు.

మ‌న ద‌గ్గ‌ర చిన్న పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా వెండితో చేసిన మొల‌తాడును క‌ట్ట‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే ఎలాంటి మొల‌తాడు క‌ట్టినా దాంతో మాత్రం ఉప‌యోగ‌మే ఉంటుంద‌న్న‌మాట‌.

Admin

Recent Posts