సాధారణంగా ఎవరి ఇండ్లలో అయినా పాత పుస్తకాలు, న్యూస్ పేపర్లు కిలోల కొద్దీ పేరుకుపోతుంటాయి. ఈ క్రమంలో వాటిని కొందరు విక్రయిస్తారు. కానీ కొందరు అలా చేయరు. దీంతో అవి పెద్ద పెద్ద దొంతరల్లా పేరుకుపోతుంటాయి. అయితే ఇలా వాటిని నిల్వ చేసుకోవడం సాధారణ విషయమే అయినా.. పాత పుస్తకాలు, న్యూస్ పేపర్లలో కాగితాలు పసుపు రంగులోకి మారుతాయి. తెలుసు కదా. అవును, అదే. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
పుస్తకాలు లేదా న్యూస్ పేపర్లు ఏవైనా వాటిలో ఉపయోగించే కాగితాన్ని సెల్యులోజ్, లిగ్నిన్ అనే రెండు రకాల పదార్థాలతో తయారు చేస్తారు. వీటిల్లో ఒక్కో పదార్థం ద్వారా భిన్నమైన దశల్లో తయారు చేసే కాగితం ఒక్కో రకమైన నాణ్యతను కలిగి ఉంటుంది. అయితే సెల్యులోజ్ తో తయారు చేయబడే కాగితం మాత్రం అంత త్వరగా పసుపు రంగులోకి మారదు. కానీ లిగ్నిన్ తో తయారు చేసే కాగితం మాత్రం త్వరగా పసుపు లేదా బ్రౌన్ రంగులోకి మారుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే…
లిగ్నిన్ తో తయారు చేయబడే కాగితం వాతావరణంలో ఉండే ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది. దీంతో ఆక్సిడేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ క్రమంలోనే తెల్లగా ఉన్న కాగితం కూడా పసుపు రంగులోకి మారుతుంది. అందుకనే పాత పుస్తకాలు, న్యూస్ పేపర్ల కాగితాలు అలా పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతాయి. కానీ ఇలా చేయకుండా నివారించవచ్చు. ఎలాగంటే.. ఆయా పుస్తకాలు లేదా పేపర్లను కాంతి తగలని ప్రదేశంలో ఉంచాలి. అలాగే తేమ లేని పొడి వాతావరణంలో వాటిని పెట్టాలి. ఇక చీటికీ మాటికీ వాటిని టచ్ చేయరాదు. ఇలా ఈ టిప్స్ పాటిస్తే పాత పుస్తకాలు, పేపర్లను పసుపు రంగులోకి మారకుండా చూసుకోవచ్చు.