హిందూ సాంప్రదాయంలో అనేక ఆచారాలు, వ్యవహారాలను ఎంతో కాలం నుంచి పాటిస్తూ వస్తున్నారు. వాటిల్లో ఉప్పును చేతికి ఇవ్వకపోవడం కూడా ఒకటి. సాధారణంగా చాలా మంది శుక్రవారం పూట ఉప్పును ఎవరికి ఇవ్వరు. ఉప్పును ఆ రోజు కొనుగోలు కూడా చేయరు. ఎందుకంటే ఉప్పును సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కనుక ఉప్పును ఇతరులకు ఇస్తే ఇంట్లో నుంచి ధనం వెళ్లిపోతుందని భావిస్తారు. కనుకనే శుక్రవారం ఉప్పును ఎవరికీ ఇవ్వరు.
ఇక ఇతర సమయాల్లో ఉప్పును చేతికి ఇవ్వరు. కింద పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అనే దానికి సైంటిఫిక్ కారణం చూస్తే.. ఉప్పు మన చర్మానికి ఎక్కువ సేపు అంటి పెట్టుకుని ఉంటే మంచిది కాదు. చర్మానికి హాని చేస్తుంది. కనుకనే చేతికి ఇవ్వరు అని అనుకోవచ్చు. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే..
ఉప్పు లక్ష్మీదేవితో సమానం. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితోపాటు ఉప్పు కూడా మహాసముద్రం నుంచి వచ్చిందని చెబుతారు. కనుకనే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అలాంటి ఉప్పును చేతికి ఇవ్వడం అంటే పాపం చేసినట్లే అని భావిస్తారు. కనుకనే ఉప్పును ఎవరు చేతికి ఇవ్వరు, తీసుకోరు. ఇవీ.. దీని వెనుక ఉన్న కారణాలు.