భారత దేశం అనేక మతాలు, కులాల సమాహారం. అనేక వర్గాలకు చెందిన వారు దేశంలో నివసిస్తున్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లి చూసినా అక్కడ ప్రాంతీయతత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కేవలం ఆ ప్రాంత వాసులకే పరిమితమయ్యే ఆచారాలు, సాంస్కృతిక వ్యవహారాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక్కో ప్రాంతంలో వారు పెట్టుకునే పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల పేర్లు చదివేందుకు లేదా పిలిచేందుకు ఒకటిగానే అనిపించినా వాటిల్లో కాస్త వ్యత్యాసం ఉంటుంది. అలాంటి పేర్లే శర్మ, శాస్త్రి. ఇవి రెండు బ్రాహ్మణుల పేర్లని అందరికీ తెలుసు. మరి ఈ రెంటింటికీ మధ్య తేడా ఏమిటి.. అంటే..?
శర్మ అనేది సంస్కృత పదం . ఈ సంస్కృత పదం శర్మ యొక్క అర్థం దేవునిచే రక్షించబడినవాడు అని వస్తుంది. నిజానికి శర్మ అనే పదం ఇంటిపేరు కాదు. ఇది బ్రాహ్మణుని ఏదైనా పేరును సూచించడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, గౌతమ అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడని అనుకుందాం. శ్రీమాన్ గౌతమ శర్మ దేవుడు రక్షించిన శ్రీ గౌతముడు అని అర్థం వస్తుంది.
కాబట్టి బ్రాహ్మణులందరూ వారి ఇంటిపేరుతో సంబంధం లేకుండా, దేవుడిచే రక్షించబడిన శర్మ అనే పదంతో సూచించబడటం చూడవచ్చు. ఇక శాస్త్రి అంటే శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు అని అర్థం. మొదట ఇవి గుణ వాచకాలు కానీ కాలక్రమేణా నామ వాచకాలు అయ్యాయి. దీన్ని కూడా చాలా మంది పేరుగా పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఇందులో వేరే అర్థం ఏమీ లేదు.