ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాలలో ఏయే వారాలలో ఏ దేవుని పూజిస్తే ఫలితం ఉంటుందో నిర్ణయించారు&period; అంటే&period;&period; ఆదివారం సూర్యభగవానుడు&comma; సోమవారం శివుడు&comma; మంగళవారం సుబ్రమణ్యస్వామి&comma; ఆంజనేయ స్వామి&comma; బుధవారం అయ్యప్పస్వామి&comma; గురువారం సాయిబాబా&comma; శుక్రవారం అమ్మవారు&comma; శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకం&period; ఇలా ఒక్కో రోజుని ఒక్కో దేవునికి ప్రత్యేకంగా చెప్పబడింది&period; వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేకం కావడంతో&period;&period; ఆ రోజు ఆ దేవుడికి పూజలు&comma; దర్శనాలు చేసుకుంటారు&period; కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి భక్తుడు ఆ అలంకారప్రియుడిని శనివారమే దర్శించుకోవాలని భావిస్తాడు&period; ఇంతకీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందుకు ప్రత్యేకం &quest; ఆ రోజే ఏడుకొండల వాడిని పూజించాలా &quest; మిగిలిన రోజుల్లో శ్రీనివాసుడి కరుణాకటాక్షాలు పొందలేమా &quest; సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధిస్తారు&period; వెంకటేశ్వర స్వామిని శనివారం పూజించడం వెనక చాలా కారణాలే ఉన్నాయి&period; ఓంకారం ప్రభవించిన రోజు శనివారం కావడం&comma; శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం కావడం&comma; వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం కావడం&comma; ఆలయం నిర్మాణం చేయమని శ్ర్రీనివాసుడు తొండమాను చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారమే కావడంతో వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రీతికరంగా మారింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90687 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;venkateshwara-swamy&period;jpg" alt&equals;"why venkateshwara swamy likes saturday very much " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసినది కూడా శనివారమే కావడం విశేషం&period; అంతేకాదు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడినది కూడా శనివారం అవడంతో శనివారానికి&comma; శ్రీనివాసుడికి గట్టి బంధం ఏర్పడింది&period; అలాగే శ్రీనివాసుని సుదర్శనం పుట్టిన రోజు కూడా శనివారం అవడంతో&period;&period; ఆ ఏడుకొండల స్వామి వేంకటేశ్వరునికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమైనది&period; అందుకే ప్రతి భక్తుడూ శనివారమే&period;&period; ఆ వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts