ఆధ్యాత్మికం

Women Sleep With Long Hair : మహిళలు రాత్రుళ్లు జుట్టు విరబోసి ఎందుకు నిద్రపోకూడదు..? కారణం తెలుసా..?

Women Sleep With Long Hair : చాలామంది, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తల దువ్వుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ఇవి నిజానికి చెడు అలవాట్లు. ఇలాంటి పొరపాట్లు ని మహిళలు అసలు చేయకూడదు. అలానే, రాత్రిపూట తల దువ్వుకోవడమే కాదు, జుట్టు విరబూసుకుని నిద్రపోకూడదు కూడా. మన పెద్దవాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు మహిళలు, రాత్రిపూట జుట్టు విరబూసుకుని నిద్రపోకూడదు..? హిందూ సాంప్రదాయం ఏం చెప్తోంది..? ఈ విషయాలనే మనం ఇప్పుడు చూద్దాం.

రాత్రి పూట జడ వేసుకోకుండా, లూజ్ గా వదిలేసి, నిద్రపోవడం వలన పలు సమస్యలు వస్తాయి. హిందూ సంప్రదాయం ప్రకారం, రాత్రిపూట మనం జుట్టు వదిలి నిద్రపోవడం వలన దుష్టశక్తులు ప్రభావం పడుతుంది. రాత్రిపూట జుట్టు వదులుగా ఉంచి, నిద్రపోతే దాని వలన కలిగే దుష్ప్రభావాలు గురించి ఇప్పుడు చూసేద్దాం. ఈ రోజుల్లో చాలామంది జుట్టుని లూజ్ గా వదిలేస్తున్నారు. రకరకాల హెయిర్ స్టైల్స్ ని వేసుకుంటున్నారు.

women should not loosen their hair at night

సో ఉదయం నుండి ఇలాగే ఉంటూ రాత్రి కూడా జుట్టు వదిలేసి నిద్రపోతూ ఉంటారు. కానీ ఇలా వెంట్రుకలని జడ వేసుకోకుండా వదిలేయడం సరికాదు అని, వేదాలు చెబుతున్నాయి. రాత్రి పడుకునేటప్పుడు జుట్టు అలా వదిలేస్తే, ప్రతికూల ప్రభావం బాగా పడుతుంది. రాత్రి సమయంలో ప్రతికూల శక్తులు, చెడు శక్తులు ఎక్కువగా ఉంటాయి. జుట్టుని లూజ్ గా వదిలేస్తే నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వదులుగా ఉన్న వెంట్రుకల్ని ఒకదానికొకటి రాపిడి జరగడం వలన శరీరంలో ప్రతికూల శక్తులు ప్రవేశించి, సమస్యలు కలుగుతాయి.

రాత్రిపూట జుట్టుని వదిలేసుకుని నిద్రపోవడం వలన కుటుంబ సమస్యలు కూడా కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలా నిద్రపోవడం వలన, దంపతులు మధ్య సానిహిత్యం దెబ్బతింటుంది. రాత్రిపూట నల్లని జుట్టుని వదిలేసి నిద్రపోతే శని ప్రభావం పడి, జీవితంలో సమస్యలు కలుగుతాయి, రాత్రి నిద్ర పోయేటప్పుడు, జుట్టును వదిలేసుకుని నిద్రపోవడం వలన జుట్టు కూడా రాలిపోతుంది. దిండుకి, జుట్టుకి రాపిడి జరిగి జుట్టు చెట్లిపోతుంది. అలానే జుట్టు ఊడిపోతుంది.

Admin

Recent Posts