Okra : మనం తరచూ తినే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి. బెండకాయలను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. కొందరు మాత్రం ఇవి జిగురుగా ఉంటాయన్న కారణం వల్ల వీటిని తినేందుకు అంతగా ఆసక్తిని చూపరు. అయితే వాస్తవానికి మనకు బెండకాయల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బెండకాయల్లో మన శరీరానికి ఉపయోగపడే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్‌ను మనం వీటి వల్ల పొందవచ్చు. ఇక బెండకాయలతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయల్లో మన శరీరానికి కావల్సిన అనేక ఖనిజాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా సమృద్ధిగానే ఉంటాయి. బెండకాయలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి బెండకాయలను ఒక వరమనే చెప్పవచ్చు. దీని వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వీటిని తింటే షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ సైతం తగ్గుతాయి. బెండకాయలను తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్త నాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.
ఇక బెండకాయలను తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అజీర్తి తగ్గుతుంది. మలబద్దకం పోతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. బెండకాయలను తింటే శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. రెగ్యులర్‌గా బెండకాయలను తింటే బరువును తగ్గించుకోవడం చాలా తేలికవుతుంది. వీటిని తింటే శరీరంలోని వాపులు, నొప్పులు కూడా తగ్గుతాయి. ఇలా బెండకాయలను తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. కనుక వీటిని మిస్ చేయకుండా తినండి. ఎన్నో లాభాలను పొందండి.