ఆధ్యాత్మికం

మంగళసూత్రం ధరించే మహిళలు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మంగళసూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెళ్లి అయిన తర్వాత మహిళలు తన భర్త జీవించి ఉన్నంతకాలం మెడలో మంగళసూత్రం ధరించి ఉంటారు. ఈ విధంగా మంగళసూత్ర భర్త ఆయుష్షును సూచిస్తుందని చెప్పవచ్చు.ఈ విధంగా పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించే మహిళలు మంగళసూత్రంతో పాటు కొన్ని ఎర్రటి, నల్లని పూసలను కూడా ధరిస్తారు. అదేవిధంగా మరికొందరు మహిళలు మంగళసూత్రంతో పాటు లక్ష్మీ బొట్టు కూడా ధరిస్తుంటారు. ఈ విధంగా పూసలు ధరించేటప్పుడు మంగళసూత్రంలో ఎన్ని ఉండాలి అనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి.

మంగళసూత్రంలో ఈ విధంగా ఎర్ర, నల్లపూసలను ధరించేవారు మొత్తం తాళితో సహా తొమ్మిది ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అదేవిధంగా తాళిని మరికొందరు తీసేసి పడుకోవడం చేస్తుంటారు. ఆ విధంగా తాళిని ఎట్టి పరిస్థితులలో తీయకూడదు. అలాగే ఒకవేళ మంగళ సూత్రం మార్చుకోవాల్సి వచ్చినప్పుడు మెడలో పసుపు కొమ్మ కట్టుకొని తాళిని మార్చుకోవాల్సి ఉంటుంది.

women who wear mangala sutam follow these rules women who wear mangala sutam follow these rules

ఈ విధంగా తాళిని మార్చుకోవాలి అనుకునేవారు మంగళ, శుక్రవారాలలో ఎలాంటి పరిస్థితులలో కూడా మార్చుకోకూడదు. ఈ విధంగా మార్చడం వల్ల పుణ్య స్త్రీ కి మంచిది కాదని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రానికి ప్రతిరోజూ పూజ తరువాత పసుపు కుంకుమ పెట్టుకోవడం ద్వారా తన భర్త ఆయుష్షు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా మంగళసూత్రం ధరించే మహిళలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

Admin

Recent Posts