న‌ట్స్ & సీడ్స్

వాల్ న‌ట్స్‌ను ఉద‌యం ఖాళీ క‌డుపుతో తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో వాల్ న‌ట్స్ కూడా ఒక‌టి. జీడిప‌ప్పు, బాదంప‌ప్పు లాగే ఈ న‌ట్స్ కూడా మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వాస్త‌వానికి జీడిప‌ప్పు లేదా బాదంప‌ప్పు, పిస్తాప‌ప్పుల‌ను తిన్న‌ట్లుగా వాల్ న‌ట్స్‌ను తిన‌లేరు. ఈ న‌ట్స్‌ను తినేందుకు పెద్ద‌గా ఆస‌క్తిని చూపించు. కానీ వాల్ న‌ట్స్‌ను ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక అద్భుత‌మైన లాభాలను పొంద‌వ‌చ్చు. వాల్ న‌ట్స్‌ను రోజూ ఖాళీ క‌డుపుతో తినాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వాల్ న‌ట్స్‌లో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ఎముక‌లు, దంతాల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. వాల్ న‌ట్స్‌లో ఉండే మిన‌ర‌ల్స్ మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తీవ్ర‌మైన వ్యాధులు రాకుండా చూస్తాయి. వాల్ న‌ట్స్‌లో ఆల్ఫా-లినోలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బ‌ల‌హీనంగా ఉన్న ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది. వాల్ న‌ట్స్‌ను ముందు రోజు రాత్రి నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి ఉద‌యం ఖాళీ క‌డుపుతో తినాలి.

walnuts many wonderful benefits take on empty stomach

వాల్ నట్స్‌లో విట‌మిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. దీంతో చ‌ర్మం మృదువుగా మారి కాంతివంతంగా క‌నిపిస్తుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోతాయి. వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. వాల్ న‌ట్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయయి. ఇవి మెద‌డును ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వ‌ల్ల మ‌తిమరుపు స‌మ‌స్య త‌గ్గుతుంది. చిన్నారుల‌కు వాల్ న‌ట్స్‌ను ఇస్తే వారి మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. వారు చ‌దువుల్లో రాణిస్తారు.

వాల్ న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో మెద‌డుకు ఆక్సిజ‌న్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. దీని వ‌ల్ల మైండ్ చురుగ్గా ప‌నిచేస్తుంది. వాల్ న‌ట్స్ ను తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ పేషెంట్ల‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా వాల్ న‌ట్స్‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం మ‌రిచిపోకండి.

Admin

Recent Posts