మలబద్ధకం ఏర్పడితే పొట్టనొప్పి, గ్యాస్, ఏర్పడతాయి. దీనికి కారణం అనారోగ్యకరమైన త్వరగా జీర్ణం అవని ఆహారాలు తీసుకోవడమే. శరీరానికి సరిపడే ఆహారాలు తీసుకుంటే రోజుకు మూడు సార్లు సాఫీగా మోషన్ అయి ఎంతో హాయిగా వుంటుంది. కనుక తేలికగా జీర్ణం అయి మలబద్ధకం ఏర్పడని ఆహారాలేమిటో పరిశీలించండి.
పీచు అధికంగా వుండే కూరగాయలు – ఆకుపచ్చని బీన్స్, పాలకూర, కేబేజి, కాలీఫ్లవర్, బ్రక్కోలి, ఉల్లిపాయ, సొరకాయ, టమాటా, కేరట్లు వంటివి అధిక పీచు కలిగి నీటిలో బాగా కరిగిపోతాయి. వీటిని మలబద్ధకం పోగొట్టేందుకు ఆహారంలో చేర్చండి. గింజలు – గొధుమ, రైస్, ఓట్మీల్, జొన్నలు, బార్లీ మొదలైన గింజలు కూడా గ్యాస్ తగ్గించి జీర్ణ క్రియ పెంచేట్లు చేస్తాయి.
పండ్లు – తాజా పండ్లు, ఆపిల్, బొప్పాస, పుచ్చకాయ, బెర్రీలు, నిమ్మ, మామిడి, ద్రాక్ష , అరటిపండు వంటివి సుఖ విరోచనమయ్యేలా చేస్తాయి. ఎండు ఫలాలు – అప్రికాట్స్, బాదం, ఖర్చూరం, రేగుపండు, ఎండు ద్రాక్ష వంటివి కూడా నీటిలో కరిగే పండ్లు. వీటిని కనుక సాయంత్రంవేళ స్నాక్స్ గా తీసుకుంటే, తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. తాజా పండ్ల రసాలు, తగినంత నీరు తాగితే కూడా మలబద్ధకాన్ని నివారిస్తాయి.