సన్నగా నాజూకుగా వుండే వారికి కూడా కన్పడిన జంక్ ఫుడ్ అంతా తింటూ వుండటంతో అసహ్యంగా శరీరంలో పొట్ట ముందుకు పొడుచుకు వస్తూంటుంది. మరి సన్నగా వుండే ఈ ప్రత్యేక వ్యక్తులకు పొట్ట తగ్గి ఆకర్షణీయ రూపం ఏర్పడాలంటే ఏం చేయాలో చూడండి. ఆహారం – ముందుగా, బాగా రుచిగా వున్నాయంటూ తినేసే ఆహారాలు మానండి. రుచిగా వుండే ఆహారం అనారోగ్యాన్నిచ్చే అవకాశాలు బాగా వున్నాయి. నూనెతో చేసిన ఆహారాలు బయటివి తినటం మానండి. వీలైనంతవరకు ఇంటి తయారీ వంటకాలకే పరిమితమవండి.
నీరు అధికంగా తాగటం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా గల పండ్లు తినడం అధిక కొవ్వు నిల్వలను, బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్ వంటివి తొలగిస్తాయి. వ్యాయామం – పొట్ట తగ్గే వ్యాయామాలు చేయండి. నేలపై పరుండి, పొట్ట బిగించటం, వెనక్కు ముందుకు లాగటం వంటివి చేయండి. ప్రతిరోజూ నేలపై పరుండి కొన్నిపొట్ట వ్యాయామాలు చేస్తే అతి త్వరగా పెరిగిన పొట్ట గట్టిపడి, తగ్గిపోతుంది. అవసరమనుకుంటే, ఒక వ్యాయామ బాల్ ఉపయోగించండి. ఇతర వ్యాయామాలైన సైకిల్ తొక్కటం, స్విమ్మింగ్ వంటివి త్వరగా కొవ్వు కరిగిస్తాయి.
మ్యాట్ పై పరుండి మీ మోకాళ్ళను ఛాతీవైపుగా లాగటం వంటివి కూడా పొట్టను నియంత్రిస్తాయి. నేలపై పరుండి శరీర క్రింది భాగాన్ని ఎడమనుండి కుడికి, కుడినుండి ఎడమకు రొటేట్ చేస్తువుండండి. శరీర పైభాగం మాత్రం నిలకడగా పైకి చూస్తూ వుండాలి. మరొక వ్యాయామంగా, నేలపై తిన్నగా నిలబడండి, వీలైనంత బాగా కిందకు వంగుతూ చేతుల వేళ్ళతో పాదాలు పట్టుకుని మరల పైకి లేస్తూ వుండండి.