హెల్త్ టిప్స్

పురుషుల్లో ఉండే స్త‌నాలు త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

లావుగా వుండే పురుషులు కొవ్వు పట్టిన పొట్ట, లావైన నడుము, సన్నపాటి ఛాతీ కలిగి వుంటారు. ఈ ఆకారం అసహ్యంగా వుండి మహిళలకు చికాకు పెడుతుంది. కనుక విశాలమైన ఛాతీతో ఆకర్షణీయంగా ఎలా వుండాలో పరిశీలించండి. జంక్ ఫుడ్ వదలండి – ఛీజ్ బర్గర్లు, వేపుడులు, పిజ్జాలు తినడం మానాలి. కూల్ డ్రింకులు మానండి. ఆల్కహాల్, స్మోకింగ్ వంటివి తగ్గించాలి. మీ రోజు మొత్తం ఆహారం 1,000 నుండి 1500 కేలరీలుగా వుండేలా చూడండి. కొద్ది కొద్దిగా తరచుగా తినండి.

నీరు అధికంగా తాగితే, తినే ఆహార పరిమాణం తగ్గుతుంది. పండ్లు బాగా తీసుకోండి. బెంచ్ ప్రెస్ – మగవారి స్తనాలు మాయమవ్వాలంటే వెయిట్ లిఫ్టర్స్ వాడే బెంచ్ ప్రెస్ వ్యాయామం చాలా బాగా పనిచేస్తుంది. కండరాలను, ఛాతీని బలపరుస్తుంది. బెంచ్ పై వెల్లకిలా పడుకోవడం మీ ఛాతీని వెన్నును గట్టిగా ప్రెస్ చేయడం చేస్తే క్రమేణా మీ ఛాతీ కొవ్వు కరిగిపోతుంది.

how to reduce breasts in men

మగవారి స్తనాలు జెనెటిక్ పరిస్ధితిని బట్టి కూడా వుంటాయి. ఫైటో ఈస్టరోజన్ ఆహారాలు మానేస్తే వీటి లావు కొంత నియంత్రించవచ్చు. బ్రెస్టు కణాలలో వుండేది కొవ్వు మాత్రమే కనుక అది వర్కవుట్లు, ఆహారం మితంగా తీసుకోవడంతో నియంత్రించవచ్చు.పుష్ అప్ లు, డంబ్ బెల్స్ కూడా విశాలమైన ఛాతీ కొరకు సూచించవచ్చు. లేదా స్విమ్మింగ్, సైకిలింగ్, రన్నింగ్ వంటి హార్ట్ పంపింగ్ వ్యాయామాలు విశాలమైన ఛాతీకి పురుషులకు సహకరిస్తాయి.

Admin

Recent Posts