వినోదం

Nagarjuna : నాగార్జున అలా చేయడంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్ట‌డానికి వ‌చ్చార‌ట‌.. ఇంతకీ ఏం జ‌రిగిదంటే..?

Nagarjuna : మల్టీస్టారర్ సినిమా అన్నప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కొంచెం తేడా కొట్టినా అభిమానులు హర్ట్ అవుతారు.ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరిగింది. రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ పాత్ర నిడివి త‌క్కువగా ఉంది. పాత్ర‌కు ప్రాధాన్య‌త కూడా త‌క్కువ ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడు రాజమౌళి పై ట్రోల్స్ కూడా చేశారు. కొంత‌మంది అయితే ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు నెగిటివ్ ప్ర‌చారం కూడా మొద‌లు పెట్టారు. అయితే ఇలాంటి గొడవలు ఇప్పుడే కాదు.. ఒకప్పుడు కూడా జరిగాయి.

సూపర్ స్టార్ కృష్ణ నాగార్జున హీరోలుగా వారసుడు అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి మురళీమోహన్ నిర్మాతగా వ్యవహరించారు. కాగా ఈ సినిమా సమయంలో జరిగిన ఓ గొడవ గురించి మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారసుడు సినిమాలో ఒక సందర్భంలో కృష్ణ నాగార్జునతో నువ్వెంత అంటూ వాదించడం జరుగుతుంది. ఆ సీన్లో నాగార్జున కృష్ణను పట్టుకుని వాదిస్తూ మాట్లాడతారని తెలిపారు.

actor krishna fans went to beat nagarjuna what happened then actor krishna fans went to beat nagarjuna what happened then

అయితే ఈ సన్నివేశం కారణంగా సినిమా విడుదలైన తర్వాత కృష్ణ అభిమానులు తనతో గొడవ పడ్డారని తెలిపారు. సినిమాలోని తన పాత్ర నచ్చడంతో కృష్ణ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా కృష్ణ గొప్ప మనసున్న హీరో అని తెలిపారు. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలను ఆదుకునే విషయంలో కృష్ణ అందరి కంటే ముందు ఉంటానని చెప్పారు. నిర్మాత దగ్గర డబ్బులు లేకపోయినా కృష్ణ అండగా నిలబడి సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని మురళీమోహన్ తెలిపారు.

Admin

Recent Posts