వినోదం

Attarintiki Daredi : అత్తారింటికి దారేది, అంటే సుంద‌రానికీ.. ఈ 2 సినిమాల్లో ఒకేలా ఉన్న ఈ పాయింట్ గమనించారా..?

Attarintiki Daredi : నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అంటే సుందరానికీ. యంగ్ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫుల్‌ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా.. కలెక్షన్లు మాత్రం ఆశించిన మేర రాలేదు. కానీ ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్ లో కొనసాగింది. ఈ మూవీలో వేరువేరు కమ్యూనిటీలకు చెందిన ఇద్దరు యువతి యువ‌కులు ప్రేమించుకుంటే వచ్చే ఇబ్బందులు.. ఆ తర్వాత వాళ్ళ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించుకునేందుకు ప‌డే క‌ష్టాల నేపథ్యంలో తెరకెక్కించారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అత్తారింటికి దారేది సినిమాకు ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే.. అత్తారింటికి దారేది సినిమాలో నదియా పవన్ కళ్యాణ్ కు అత్తగా నటించిన సంగతి తెలిసిందే. ఇక నదియాకు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే అప్పటికే పెద్ద కూతురుకు కోట శ్రీనివాసరావు మనవడితో నిశ్చితార్థం పూర్తవుతుంది.

attarintiki daredi and ante sundaraniki movies got this common point

దాంతో తన రెండో కూతురు సమంతను ఇచ్చి పెళ్లి చేస్తానని కోటకు నదియా మాట ఇస్తుంది. ఇక అంటే సుందరానికీ సినిమాలో కూడా అదే మాదిరిగా ఓ సన్నివేశం ఉంది. ఈ సినిమాలో కూడా న‌దియా నానికి అత్త‌గా న‌టించింది. నదియా పెద్ద కూతురు ఓ వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంటుంది. దాంతో నదియా రెండో కూతురైన నర్జియాను ప్రేమ వివాహం కాకుండా తాము చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతారు. ఇక ఇది గమనించిన ప్రేక్షకులు ఈ సీన్ ఎక్కడో చూసినట్టుంది అంటూ అత్తారింటికి దారేది సినిమాను గుర్తు చేసుకుంటున్నారు.

Admin

Recent Posts