వినోదం

Chiranjeevi : చిరంజీవి, బాలకృష్ణ, రాధ వీరి ముగ్గురి జీవితంలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా..?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ల‌ వంటి వారు. ఇద్దరూ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. 1990వ‌ దశాబ్దంలో వీరి సినిమాల మధ్య ఎంతో పోటీ ఉండేది. ప్రేక్షకులు కూడా బాలయ్య మాస్ యాక్షన్ ని, చిరంజీవి అదిరిపోయే డ్యాన్స్ ని ఎంతో ఇష్టపడేవారు. ఎన్నో రకాల కొత్త కథాంశాలతో పోటాపోటీగా చిత్రాల్లో నటించేవారు. అభిమానుల్లో బాలయ్యకు, చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మనసుల‌ను దోచుకున్నారు.

ఇక వీరిద్దరి సినిమాల్లో కథానాయికగా నటించిన అందాల భామ హీరోయిన్ రాధ. ఈమె మలయాళీ అయినా, తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చిరంజీవితో గుండా, దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, కొండవీటి దొంగ, రాక్షసుడు, యముడికి మొగుడు, స్టేట్ రౌడీ, కొదమ సింహం వంటి చిత్రాల్లో చిరంజీవికి ధీటుగా రాధ నటించింది. ఇక బాలయ్యతో ముద్దుల కృష్ణయ్య, రాముడు భీముడు, దొంగరాముడు, రక్తాభిషేకం వంటి చిత్రాలు ఎన్నో హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె కెరీర్ ముగుస్తున్న దశలో రాజశేఖర్ అనే బిజినెస్‌ మ్యాన్ ని వివాహం చేసుకొని స్థిరపడింది.

chiranjeevi balakrishna and radha have this common point

అసలు ఈ ముగ్గురు గురించి ఎందుకు చెబుతున్నారా అని ఆలోచిస్తున్నారా.. ఈ ముగ్గురు మధ్య ఓ ఆసక్తికర పోలిక వుంది. అదేమిటంటే చిరు, బాలయ్య ఇద్దరు పాలిటిక్స్ లో ఉండడం. ఇక ముగ్గురికి ముగ్గురేసి పిల్లలు ఉన్నారు. చిరుకి సుస్మిత, శ్రీజ అనే ఇద్దరు అమ్మాయిలు, రామ్ చరణ్ అనే ఓ అబ్బాయి. బాలయ్యకు కూడా బ్రాహ్మణి, తేజస్విని అనే ఇద్దరు అమ్మాయిలు, మోక్షజ్ఞ అనే ఓ అబ్బాయి. అలాగే రాధకు కూడా ముగ్గురు పిల్లలే. అది కూడా ఈమెకు ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉండటం విశేషమే.

చిరు, బాలయ్య కూతుర్లు సినీ రంగానికి దూరంగా ఉండడం కూడా ఓ కామన్ పాయింట్. చిరు కుమారుడు రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా సినీ ఆరంగేట్రం చేయడానికి సిద్ధంగా వున్నాడు. ఇది యాదృచ్ఛమే అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరికీ ఇద్దరేసి అమ్మాయిలు, ఒక్కో అబ్బాయి. కానీ రాధ పెద్ద కూతురు కార్తీక తమిళ, మలయాళ, తెలుగు చిత్రాలతో అందరిని ఆకట్టుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెండో కూతురు తులసి కూడా తమిళ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొడుకు విగ్నేష్ మాత్రం సినీ రంగానికి దూరంగా ఉంటూ, తండ్రి బాటలోనే వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు.

Admin

Recent Posts