వినోదం

బాహుబలి, కేజిఎఫ్, పుష్ప, బింబిసార మధ్య ఉన్న ఈ పోలికను మీరు గమనించారా!

వరుస ఫెయిల్యూర్స్ తో విసుగెత్తిపోయిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తో ఇండస్ట్రీనే తనవైపు చూసేలా చేశాడు. బలమైన కథతో, ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్ లో బాగా రన్ అయింది. ‘బింబిసార’ అటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఓకే అనిపించింది. ఈ చిత్రం పై ఆడియన్స్ పాజిటివ్ గా స్పందించారు. సినీ తారలు ఈ క్లాసికల్ ఫిల్మ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే దాదాపు రూ.20 కోట్లతో నిర్మించిన ‘బింబిసార’ చిత్రం కేవలం మొద‌టి మూడు రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టింది.

ఇది ఇలా ఉంటే రెండేళ్ల గ్యాప్ లో బాహుబలి 1, బాహుబలి 2 విడుదల కాగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత కేజిఎఫ్ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు పార్టులుగా తిరకెక్కించినట్లు ప్రకటించారు. ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ నీల్ పేరు మారుమ్ మారుమ్రోగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్ 1 తో సంచలన విజయాన్ని సొంతం చేసుకొని, పార్ట్ 2ను రీసెంట్‌గా రిలీజ్ చేసి హిట్ కొట్టారు. మొదట ఒక పార్ట్ గా పుష్పను తెరకెక్కించాలని అనుకున్న సుకుమార్ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

do you know about a common point in these movies

మల్లిడి వశిష్టు సైతం బింబిసార సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు. బింబిసార పార్ట్1 సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో బింబిసార 2 ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలన్నీ పార్ట్ 1 విడుదలై సక్సెస్ సాధించిన తర్వాతే పార్ట్ 2 తెరకెక్కిన సినిమాలు కావడం గమనార్హం. బాహుబలి, కేజిఎఫ్, పుష్ప, బింబిసార బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. దీంతో బింబిసార 2 వ‌స్తే కూడా హిట్ అవుతుంద‌ని అంటున్నారు.

Admin

Recent Posts