వినోదం

ఈ 7 సెలబ్రిటీ కపుల్స్ (జంటల) మధ్యనున్న “ఏజ్ గ్యాప్” ఎంతో తెలుసా..? ఎవరు ఎవరికంటే పెద్ద?

పెళ్లంటే పందిళ్లు,సందిళ్లు ,తప్పట్లు ,తాళాలు, తలంబ్రాలు,మూడే ముళ్లు ..ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్లు…నూరేళ్ల బంధం కలకాలం అలాగే ఉండాలని కోరుకుంటాం..కానీ సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో తెలీదు.నిన్న మొన్న అన్యోన్యంగా ఉన్నవాళ్లు కూడా రేప్పొద్దున్న విడాకులకు అప్లై చేసినకేసులు మనం చాలా చూసాం.పెళ్లికి మొదటి అర్హతగా వయసును పరిగణిస్తారు పెద్దలు.వివాహం చేసుకునే వారికి పెళ్లీడు రావడమే కాదు వరుడు,వధువు కన్నా పెద్దగా ఉంటే బాగుంటుందనేది పెద్దల ఆలోచన.

ఇవాళ రేపు ఎవరిష్టం వారిది అన్నట్టుగా వదువు కంటే చిన్నగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారు..ఈ టాపిక్ రాగానే మనకు మొదట గుర్తొచ్చే సెలబ్రిటీ టెండుల్కర్..అవునండీ సచిన్ కంటే అంజలి పెద్దది..అయినప్పటికీ వారిప్పటికి అన్యోన్యంగా ఉంటున్నారు.సాధారణంగా అమ్మాయిలు తమకంటే ఒకట్రెండు ఏళ్లు పెద్దవారిని హజ్బెండ్ గా కోరుకుంటుంటారు.మరి కోస్టార్స్ నే పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల ఏజ్ గ్యాప్ లు తెలుసుకుంటే ముక్కున వేలేసుకుంటారు.. బొమ్మరిల్లు హాసిని గుర్తుంది కదా.. అల్లరిపిల్ల జెనిలియా తన తొలిచిత్ర నటుడు రితేష్ దేశముక్ ను లవ్ చేసి పెళ్లిచేసుకుంది వారి పెళ్లి జరిగి ఏళ్లు అవుతుంది,వారిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తొమ్మిదేళ్లు..

do you know the age gap between these celebrity couples

తమిళ్ థలా..అజిత్ కి షాలిని కి మధ్య ఏజ్ గ్యాప్ ఎనిమిది సంవత్సరాలు..షాలిని బాలనటిగా మనకు సుపరిచితమే..షాలిని చెల్లెలే షామిలి..వీరిద్దరినీ మనం జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో చూసాం..అజిత్ ది,షాలిని ది ప్రేమ వివాహమే.. దేవ‌ర‌ గా మన ముందుకు వ‌చ్చిన‌ నటుడు ఎన్జీఆర్ చేసుకున్న పిల్ల ఎలా ఉంటుందో ,ఎవరిని చేసుకుంటాడో అని పెళ్లికి ముందు వరకు ఎదురు చూసాం.లక్ష్మీ ప్రణతిని పెళ్లిచేసుకున్నాడు.వారికి ఇద్ద‌రు కొడుకులు. ఇక ఈ క‌పుల్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా పదిసంవత్సరాలు …ప్రణతి పదేండ్లు చిన్నది ఎన్టీఆర్ కంటే.. లత 8 సంవత్సరాలు రజినీ కాంత్ కంటే చిన్నది. అలాగే స్నేహ కంటే ప్రసన్న 3సంవత్సరాలు పెద్దవాడు .

జ్యోతిక కంటే సూర్య 3 సంవత్సరాలు పెద్దవాడు. చరణ్ ఉపాసన కంటే 4 సంవత్సరాలు పెద్ద.కానీ పెళ్లి సమయంలో చరణ్ కంటే పెద్దగా కనపడ్తుంది అనే మాటను ఎదుర్కొంది ఉపాసన.తర్వాత తర్వాత సన్నబడి చరన్ కి సరిజోడి అనిపించుకుంది.తన మంచి మనసుతో, ప్రవర్తనతో చరణ్ కుటుంబ అభిమానాన్నే కాదు..అభిమానుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది. ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ కంటే 3 సంవత్సరాలు పెద్దది. ధనుష్ కంటే ఐశ్వర్య ర‌జ‌నీకాంత్‌ ఒక సంవత్సరం పెద్దది. కానీ వీరు ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు.

Admin

Recent Posts