వినోదం

పవర్ స్టార్ రీమేక్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయంటే..!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇక ఆయన అభిమానుల‌ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయన అభిమానులకు లెక్కే ఉండదు.. అంతటి క్రేజ్ ఉన్న ఈ హీరో ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఓ వైపు సినిమాలు తీస్తూనే మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావడానికి తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అలాంటి హీరో 10రీమేక్ సినిమాల్లో నటించాడని మీకు తెలుసా.. మరి సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం..

గోకులంలో సీత : ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. దీన్ని తెలుగులోకి రీమేక్ చేశారు. సుస్వాగతం: ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేయగా పవన్ కళ్యాణ్ దేవయాని జంటగా నటించారు. ఇది పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ని ఒక మలుపు తిప్పింది అని చెప్పవచ్చు. ఇది తమిళం నుండి రీమేక్ అయింది. అక్కడ విజయ్ హీరోగా లవ్ టుడే పేరుతో నిర్మించారు. తమ్ముడు: ఈ మూవీ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కింది. దీన్ని హిందీలో జో జీత ఓహి సికిందర్ అనే మూవీ స్ఫూర్తితో తెరకెక్కించారు. ఇందులో అమీర్ ఖాన్ హీరో. ఖుషి : పవన్ కు ఇండస్ట్రీలో మంచి హిట్ ఇచ్చిన సినిమా ఖుషి.. తమిళంలో కూడా ఈ సినిమా ఖుషి గానే తెరకెక్కింది.

do you know pawan kalyan remade these movies

అన్నవరం : ఈ సినిమాని భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేయగా తమిళంలో విజయ్ హీరోగా తిరుపచి సినిమాకి రీమేక్. తీన్ మార్ : పవన్ కళ్యాణ్ మరియు త్రిష నటించిన ఈ సినిమాని జయంత్.సి.పరాన్జీ డైరెక్షన్ చేశారు. హిందీలో సూపర్ హిట్టయిన సైఫ్ అలీఖాన్ దీపికా పడుకొనే లవ్ ఆజ్ కల్ చిత్రానికి ఇది రీమేక్. గబ్బర్ సింగ్ : హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ దబాంగ్ సినిమాకు రీమేక్. కాటమరాయుడు: తమిళంలో సూపర్ హిట్ అయినా వీరం సినిమాకి ఇది రీమేక్. అజ్ఞాతవాసి : త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఫ్రెంచ్ ది లార్గో వించు అనే సినిమాకి అఫీషియల్ రీమేక్. వకీల్ సాబ్ : ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబ్ తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన పింక్ చిత్రానికి రీమేక్.

Admin

Recent Posts