హెల్త్ టిప్స్

ఈ సూచ‌న‌లు పాటిస్తే మేక‌ప్ వేయ‌కుండానే అందంగా క‌నిపిస్తారు..!

అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఆడవాళ్లకైతే మరీనూ. అందంగా కనిపించడం కోసం ఎన్నో చేస్తారు. మార్కెట్లో దొరికే ఎన్నో ఉపకరణాలు వాడుతుంటారు. వాటివల్ల నిజంగా అందం పెరుగుతుందా అంటే సందేహమే. ఎందుకంటే ఒక్కొకరి చర్మం ఒక్కోలా ఉంటుంది. అందుకే కొన్ని ప్రొడక్టులు కొందరికే బాగా పనిచేస్తాయి. కొందరిపై అస్సలు పనిచేయవు. అంటే వారి చర్మానికి అది సరైనది కాదని అర్థం. అందువల్ల మన చర్మానికి ఏది సరైనదో అదే వాడాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఐతే మనకి సరైనదని చెప్పేది ఎవరు. అందుకే, మేకప్ వేయకుండా, ఉపకరణాలు వాడకుండా ఎలా అందంగా కనిపించాలో తెలుసుకోవాలి. మేకప్ లేకుండా అందంగా కనిపించడమా అని ఆశ్చర్యపోతున్నారా.. అవును.. అందంగా కనిపించాలంటే ముఖంపై మేకప్ అవసరం లేదు.

ఉదయం లేవగానే మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మంచినీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని విషం అంతా బయటకి పోతుంది. అందంగా కనిపించాలంటే బయట బాగుంటే సరిపోదు. లోపల శరీరంలో నుండి వ్యర్థపదార్థాలు బయటకి వెళ్తే చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. ఆరోగ్యమే అందంగా ఉంచుతుంది. నీళ్ళు తాగిన తర్వాత ఒక గ్లాసులో గోరు వెచ్చని నీళ్ళు తీసుకోవాలి. దానిలో నిమ్మరసం కలుపుని తాగాలి. ఎన్ని చేసినా నిద్ర సరిగ్గా లేకపోతే లాభం లేదు. క్వాలిటీ నిద్ర పోగలిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సో అందంగా కనబడతారు.

follow these tips you will look beautiful without makeup

బయటకి వెళ్లేటపుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. బయటకి వెళ్లాలనుకున్న పదిహేను నిమిషాల ముందే లోషన్ రాసుకుంటే మంచిది. సన్ స్క్రీన్ లోషన్ చర్మంపై అతినీల లోహిత కిరణాలు పడకుండా కాపాడుతుంది. సో, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం.. అందంగా కనబడాలంటే ముఖం ఫెయిర్ గా ఉంటే చాలదు. ముఖంపై చిరునవ్వు ఉండాలి. చిరునవ్వు మీ అందాన్ని మరింత పెంచుతుంది.

Admin

Recent Posts