వినోదం

ఎన్టీఆర్ కంటే ముందే రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన తెలుగు న‌టుడు ఎవ‌రో తెలుసా?

తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, అతి తక్కువ కాలంలోనే సీఎం స్థాయికి ఎదిగారు. కానీ ఎన్టీఆర్ కంటే ముందే ఓ నటుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో రాణించారన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.

ఆయన ఎవరో కాదు కొంగర జగ్గయ్య. దేశంలో సినిమా రంగం నుండి వచ్చి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటిన నటుడు కూడా ఈయన. అంతేకాకుండా కొంగర జగ్గయ్య నటులలో మొదటిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు.

do  you know that kongara jaggaiah came into politics even before sr ntr

కొంగర జగ్గయ్య ఎన్టీఆర్ కి కూడా సన్నిహితుడు కావడం విశేషం. ఈయన గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ గ్రామంలో ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో కొంగర జగ్గయ్య చదువుకున్నాడు. అదే కాలేజీలో ఎన్టీ రామారావు కూడా విద్యను అభ్యసించారు. అక్కడే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జగ్గయ్య వరుసగా మూడు సంవత్సరాల పాటు ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నాడు.

ఎన్టీఆర్ తో కలిసి జగ్గయ్య నాటకాలు కూడా వేశారు. విద్యార్థిగా ఉన్నప్పుడే జగ్గయ్య రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. జయప్రకాశ్ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీలో జగ్గయ్య రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇక 1956 కాంగ్రెస్ లో చేరారు. 1967 వ సంవత్సరంలో ఒంగోలు నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసి లోక్ సభకు ఎన్నికయ్యాడు. ఆయనకు 80 వేల మెజారిటీ రావడం విశేషం. ఇక ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను జగ్గయ్య చేశారు.

Admin

Recent Posts