వినోదం

మోహన్ బాబు మొద‌టి భార్య విద్యాదేవి సూసైడ్ చేసుకుంద‌ని తెలుసా..? అందుకు కార‌ణం అదేనా..?

Mohan Babu : ఫిల్మ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే చాలామంది భయపడతారు. మోహన్ బాబు ముక్కు సూటిమనిషి. ఏ విషయాన్ని అయినా ఆయన కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. మోహన్ బాబు పక్కన ఆయన సొంత సినిమాల్లో నటించే నటీనటులు చాలా క్రమశిక్షణతో ఉంటారు. చిత్తూరు జిల్లా ఏర్పేడుకు చెందిన మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు.. భక్తవత్సలం నాయుడు అనే పేరుతో అల్లరి చిల్లరగా తిరిగేవాడు. మోహన్ బాబు తండ్రి టీచర్ గా పనిచేసేవారు. మోహన్ బాబు సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై వెళ్లి స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఆయన పేరు స్క్రీన్ మీద వేయాలనుకున్నప్పుడు ఈ పేరు కంటే మరో పేరు ఉంటే బాగుంటుందని అనుకున్నాడు.

దీంతో దర్శకరత్న దాసరి నారాయణరావు భక్తవత్సలం నాయుడు పేరును కాస్తా మోహన్ బాబుగా మార్చారు. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల‌లో మోహన్ నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే మోహన్ బాబు వ్యక్తిగత జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మోహన్ బాబుకు ముందుగా విద్యాదేవితో వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే మంచు లక్ష్మీ, మంచు విష్ణు. మోహన్ బాబు – విద్యాదేవి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. కెరీర్ ప్రారంభంలో మోహన్ బాబుకు సరిగా అవకాశాలు లేనప్పుడు.. ఎన్ని కష్టాలు వచ్చినా విద్యాదేవి ఎంతో ధైర్యం చెప్పే వారట. ఓసారి మోహన్ బాబు ఇంటి అద్దె కట్టటం ఆలస్యం కావడంతో ఆ ఇంటి యజమాని వారు వంట వండుకునే పాత్రల్లో మూత్ర విసర్జన చేశాడట. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా చెప్పారు.

do you know that mohan babu first wife was committed suicide

దీంతో మోహన్ బాబు జీవితంలో ఎదగాలంటే మరింతగా కష్టపడాలని ఎక్కువ సినిమాల్లో నటించే వారట. అలా సినిమాల్లో బిజీ కావడంతో సమయానికి ఇంటికి వచ్చేవారు కాదట. దీంతో భార్య, పిల్లలను కూడా ఆయన సరిగా పట్టించుకునే వారు కాదట. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో క్షణికావేశంలో విద్యాదేవి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆ సమయంలో విష్ణు, లక్ష్మీ ఇద్దరూ కూడా చిన్న పిల్లలు. వాళ్ళకు తల్లి లేని లోటు తీర్చాలని దాసరి నారాయణ రావు లాంటి పెద్దలు జోక్యం చేసుకొని విద్యాదేవి చెల్లి నిర్మలాదేవితో మోహన్ బాబుకు రెండో వివాహం జరిపించారు. వీరి తనయుడే మంచు మనోజ్. మోహన్ బాబు తన విద్యాసంస్థలన్నిటికీ మొదటి భార్య విద్యాదేవి పేరు పెట్టారు. మొదట్లో బాగా కోపిష్టి అయిన మోహన్ బాబుకు నిర్మలాదేవితో పెళ్లి అయ్యాక ఆ కోపం క్రమంగా తగ్గింద‌ట‌.

Admin

Recent Posts