వినోదం

ఈ హీరోయిన్లు ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు.. అప్ప‌ట్లో వార్త‌ల్లో నిలిచారు..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ వివాహాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ వివాహాల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని విడాకులకు దారి తీశాయి. అయితే ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లో నిలిచిన హీరోయిన్లు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. తెలుగింటి ఆడపడుచుగా దక్షిణాదితోపాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన జయప్రద సైతం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ నహతాని ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకు పెళ్లయి పిల్లలు ఉండడంతో తమ వివాహ విషయాన్ని బయటకు చెప్పలేదు జయప్రద.

అందాల తార శ్రీదేవి రెండుసార్లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో అప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తిని ప్రేమించి ఆయనను రహస్యంగా పెళ్లాడారు. అయితే మూడేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది. బోనీ కపూర్ ని ప్రేమించిన శ్రీదేవి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ, పెళ్లి, పిల్లలు విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి మొత్తం పరిశ్రమకే షాక్ ఇచ్చింది శ్రియా శరణ్. రష్యాకి చెందిన ఆండీ కొశ్చివ్‌ ని ప్రేమించిన విషయం గానీ, పెళ్లి చేసుకున్న విషయం గానీ, చివరికి సంతానం విషయం గానీ బయటకు తెలియకుండా జాగ్రత్తపడింది. ఆ తర్వాత తీరిగ్గా విషయం చెప్పడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు.

do you know that these actress married secretly

నవరసాలను అద్భుతంగా పలకరించే నేటి తరం నటీమణుల‌ను వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి వారిలో ఒకరు రమ్యకృష్ణ. అందం, అభినయంతో దక్షిణాదిని ఏలిన ఆమె హీరోలతో సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. కొన్నేళ్లపాటు నడిచిన ప్రేమాయణానికి ఈ జంట 2003లో శుభం కార్డు వేసింది. వీరి పెళ్లి కూడా నలుగురికి తెలియకుండా రహస్యంగా ఒక గుడిలో జరిగింది.

Admin

Recent Posts