వినోదం

Chiranjeevi : చిరంజీవి కెరీర్‌లో డిజాస్ట‌ర్‌గా మారిన 15 చిత్రాలు ఏంటంటే..!

Chiranjeevi : టాలీవుడ్ లో ఎన్నో సూప‌ర్ హ‌హిట్ చిత్రాల‌లో న‌టించి మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చిరంజీవి. తెలుగులో సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్,కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తర్వాత స్వయంకృషితో తన కంటూ ఒక సామ్రాజ్యాన్నే ఏర్పరుచుకున్నారు. ఈయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు అదే రేంజ్‌లో డిజాస్టర్స్ మూవీస్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగాన్ని వదిలేసి సినిమాల వైపు రాగా, అత‌నికి గత వైభవం ఉంటుందా అన్న అనేక అనుమానాల మధ్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి చిరు ఈజ్ బ్యాక్ అనేలా చేసింది.

ఖైదీ నెం150 సినిమా త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం నిర్మాతగా ఉన్న చరణ్ కు సుమారు రూ.30 కోట్ల వరకు నష్టం వచ్చింది. సైరాతో వచ్చిన వచ్చిన నష్టాలను కొరటాల తీసిన ఆచార్యతో లాభాలుగా మార్చాలని ఎంతో ప్లాన్ చేసినప్పటికీ ఆచార్య దారుణంగా పరాజయం పొందింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన గాడ్ ఫాద‌ర్, వాల్తేరు వీర‌య్య ఓ మోస్ట‌రు విజ‌యాన్ని అందుకున్నాయి. అయితే చిరు కెరీర్‌లో డిజాస్టర్‌గా వ‌చ్చిన సినిమాలు చూస్తే అంజి.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 2004లో వచ్చినఈ సినిమా మెగాస్టార్ కి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.

do you know that these are the disaster movies in chiranjeevi career

శంక‌ర్ దాదా జిందాబాద్, మృగ‌రాజు, బిగ్ బాస్, ఎస్పీ ప‌ర‌శురాం, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, లంకేశ్వ‌రుడు, రాజా విక్రమార్క, యుద్ధ భూమి, చక్ర‌వర్తి, ఆరాధ‌న‌,త్రినేత్రుడు, కిరాత‌కుడు, జేబుదొంగ‌, రుద్ర నేత్ర వంటి చిత్రాలు చిరు కెరీర్‌లో భారీగా ఫ్లాపులుగా నిలిచాయి. చాణక్య శపథం, వేట, చిరంజీవి, ధైర్యవంతుడు, శివుడు శివుడు శివుడు, హీరో వంటి చిత్రాలు కూడా నష్టాల వలయంలో చిక్కుకొని బాక్సాఫీస్ వద్ద పూర్తిగా చతికిల పడ్డాయి. ప్ర‌స్తుతం చిరంజీవి విశ్వంభ‌ర‌ చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని భావిస్తున్నారు.

Admin

Recent Posts