Vijayashanti : లేడి సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన విజయశాంతి కమర్షియల్ హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా సినిమాలు చేసి అలరించారు హీరోలకు సమానంగా యాక్షన్ సీన్ చేస్తూఎంతగానో అలరించారు విజయశాంతి. ఇక రాజకీయాల్లో తనదైన శైలిలో గళం వినిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే విజయశాంతి చాలా ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు.
శ్రీనివాస ప్రసాద్ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడారు. కాకపోతే పెళ్లైన విషయాన్ని ఆమె చాలా కాలం దాచిపెట్టిన మాట నిజమే. పెళ్లి తర్వాత కూడా ఆమె కుమారి విజయశాంతిగానే చలామణి అయ్యారు. ఇప్పుడు ఆమె రాజకీయనాయకురాలు. ఇప్పుడు ఆ విషయంలో గోప్యత పనికిరాదు. సమాజ సేవ చెయ్యాలనే దృక్పథంతోనే ఆమె లేటుగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెకు 22 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. తనకు 25 ఏళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు అనే వార్తలు వస్తుండగా, దానిపై గతంలోనే స్పందించారు విజయశాంతి.
రాజకీయ నాయకురాలిగా ఉన్న విజయశాంతి పెండ్లి తర్వాత ఆమె పిల్లల్ని కనొద్దని డిసైడ్ అయిందట. అందుకు కారణం తన జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేయాలనుకోవడమేనట. పిల్లలు ఉంటే తాను ప్రజాసేవ చేయలేనేమో అనే భయంతో ఆమె పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకుంది. ఆమెకు కొడుకు ఉన్నాడనే విషయంపై ఓ ఇంటర్వ్యూలో ఇలా స్పందించింది విజయశాంతి. నాకు అసలు పిల్లలు లేరని తెలిసి కూడా విజయశాంతి కొడుకు ఇతనే అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ చేయడం తెలివి లేని వారు చేసే పని అంటూ విజయశాంతి మండిపడింది.