తెలుగు సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అయ్యాయి. తెలుగులో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలను ఇతర భాషలలో రీమేక్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. తెలుగులో రూపొంది ఐదు కు పైగా భాషల్లోకి రీమేక్ చేయబడ్డ తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా ఐదు భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళ్, బెంగాలీ, భోజపురి, కన్నడ, ఒడియా భాషల్లోకి రీమేక్ చేయబడింది. అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్కడు సినిమా కూడా ఐదు భాషల్లోకి రీమేక్ అయింది. తమిళ్, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లోకి రీమేక్ చేయబడి మంచి విజయం సాధించింది.
మర్యాద రామన్న మూవీ.. సునీల్ హీరోగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా సైతం ఐదు భాషల్లోకి రీమేక్ అయింది. కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లోకి రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి సినిమా ఐదు భాషల్లోకి రీమేక్ అయింది. తమిళ్, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లోకి రీమేక్ చేయబడింది. అన్ని భాషల్లో మంచి విజయం అందుకుంది. రవితేజ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమా ఆరు భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్ ,బెంగాలీలో రెండు సార్లు రీమేక్ చేయబడింది. అన్ని చోట్ల హిట్ కొట్టింది.
సిద్ధార్థ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా అత్యధికంగా తొమ్మిది భాషల్లోకి రీమేక్ అయింది. తమిళ్, కన్నడ, బెంగాలీ, మనీపూరి, ఒడియా, పంజాబీ, హిందీ, బంగ్లాదేశ్ ,నేపాల్ భాషలో రీమేక్ చేయబడింది. అన్ని చోట్ల విజయం సాధించింది.